AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే ఏమవుతుందో తెలుసా..? చిన్న తప్పుతో ఎన్ని కష్టాలో..

నేటి ఆధునిక కాలంలో భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో అన్నం తినడం ఒక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు దీనిని ఒక మధురమైన జ్ఞాపకంగా భావిస్తారు. కానీ మన ప్రాచీన శాస్త్రాలు, పెద్దలు చెప్పే మాటలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం వల్ల ప్రతికూల శక్తి ఎలా పెరుగుతుంది? ఇది పేదరికానికి ఎలా దారి తీస్తుంది? తెలుసుకుందాం..

భార్యభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే ఏమవుతుందో తెలుసా..? చిన్న తప్పుతో ఎన్ని కష్టాలో..
Husband And Wife Eating In One Plate
Krishna S
|

Updated on: Mar 21, 2026 | 1:24 PM

Share

ఈ వేగవంతమైన ప్రపంచంలో భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడానికి ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా నూతన వధూవరులు దీనిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. అయితే మన ప్రాచీన శాస్త్రాలు, పెద్దలు చెప్పే మాటలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ప్రేమగా అనిపించే ఈ అలవాటు మీ వైవాహిక జీవితంలో అశాంతికి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని తెలుసా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రతికూల శక్తి – ఆర్థిక ఇబ్బందులు

శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భార్యాభర్తలు ప్రతిరోజూ ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది నేరుగా ఇంటి లక్ష్మిపై ప్రభావం చూపుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎంతటి సంపన్న కుటుంబమైనా, ఈ అలవాటు వల్ల క్రమంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తగ్గడం వల్ల సంపాదన ఉన్నా, అది నిలవకపోవడం లేదా అనవసర ఖర్చులు పెరగడం వంటివి జరగవచ్చు.

వైవాహిక కలహాలకు మూలం

ఒకే ప్లేట్‌లో తినడం వల్ల ప్రేమ పెరుగుతుందని చాలామంది అనుకుంటారు, కానీ శాస్త్రాల ప్రకారం ఇది రివర్స్ అవుతుంది. చిన్న చిన్న విషయాలకే దంపతుల మధ్య ఘర్షణలు తలెత్తడం, అవి పెద్ద వివాదాలుగా మారడం వంటివి జరుగుతాయి. ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన గౌరవం, బాధ్యత, జవాబుదారీతనం క్రమంగా తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది.

అన్నం పట్ల జాగ్రత్తలు – శాస్త్ర నియమాలు

ఆహారం విషయంలో మన పెద్దలు కొన్ని కఠినమైన నియమాలను రూపొందించారు.

  • భోజనం చేసే ప్లేట్ పొరపాటున కింద పడినా లేదా ఎవరి కాలైనా తగిలినా ఆ ఆహారాన్ని అస్సలు భుజించకూడదు.
  • అపవిత్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం పెరుగుతుందని, అది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నమ్ముతారు.

అప్పుడప్పుడు సరదాగా లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో భాగస్వామితో ప్లేట్‌లో పంచుకోవడంలో తప్పులేదు. కానీ దానిని రోజువారీ అలవాటుగా మార్చుకోకపోవడమే శ్రేయస్కరం. ఆర్థిక శ్రేయస్సు, కుటుంబ సుఖశాంతుల కోసం మన సంప్రదాయ నియమాలను గౌరవించడం మంచిదని పెద్దలు సూచిస్తున్నారు.

Follow Us