AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.2 లక్షలకు రూ.90వేల వడ్డీ.. ఈ సూపర్ స్కీమ్ గురించి పక్కా తెలుసుకోండి భయ్యా..

Post Office: నేటి కాలంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, ప్రైవేట్ స్కీమ్స్‌లో భయం వెన్నాడుతున్న వేళ.. సామాన్యుడికి భారత ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తోంది. పోస్ట్ ఆఫీస్‌లో కేవలం రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే, ఐదేళ్లలో వడ్డీ రూపంలోనే దాదాపు రూ.90 వేల లాభం పొందే అవకాశం ఉంది. అసలు ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది? బ్యాంకులకు, పోస్ట్ ఆఫీస్ టీడీకి ఉన్న తేడాలేంటి? అనేది తెలుసుకుందాం..

రూ.2 లక్షలకు రూ.90వేల వడ్డీ.. ఈ సూపర్ స్కీమ్ గురించి పక్కా తెలుసుకోండి భయ్యా..
Post Office Time Deposit Scheme
Krishna S
|

Updated on: Mar 21, 2026 | 1:03 PM

Share

నేటి కాలంలో కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా దాచుకోవడంతో పాటు మంచి రాబడిని ఆశించే వారి కోసం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) తరహాలోనే పనిచేసే ఈ పథకం, ప్రభుత్వ గ్యారెంటీతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణంగా బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల కంటే పోస్ట్ ఆఫీస్ టీడీ రేట్లు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక పొదుపు చేయాలనుకునే వారికి ఇది ఒక వరం. ఈ పథకంలో మీరు 1, 2, 3, 5 సంవత్సరాల కాలపరిమితితో పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రస్తుత వడ్డీ రేట్లు ఇవే..

భారత తపాలా శాఖ ప్రస్తుతం వివిధ కాలపరిమితులపై అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:

  • 1 సంవత్సరం: 6.9శాతం వడ్డీ
  • 2 సంవత్సరాలు: 7.0శాతం వడ్డీ
  • 3 సంవత్సరాలు: 7.1శాతం వడ్డీ
  • 5 సంవత్సరాలు: 7.5శాతం వడ్డీ

రూ.2 లక్షల పెట్టుబడికి ఎంత వస్తుంది?

ఒకవేళ మీరు 5 సంవత్సరాల కాలపరిమితి గల పోస్ట్ ఆఫీస్ టీడీ పథకంలో రూ.2,00,000 ఒకేసారి డిపాజిట్ చేశారనుకుందాం. ప్రస్తుతమున్న 7.5శాతం వడ్డీ రేటు ప్రకారం..5 ఏళ్ల తర్వాత వచ్చే వడ్డీ రూ.89,990 గా ఉంటుంది. *మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ.2,89,990 మీ చేతికి అందుతుంది. అంటే కేవలం ఐదేళ్లలో మీ డబ్బుపై దాదాపు రూ.90 వేల లాభం వస్తుందన్నమాట. ఎటువంటి రిస్క్ లేకుండా సురక్షితమైన రాబడి కోరుకునే వారికి ఇది సరైన వేదిక.

వయస్సుతో సంబంధం లేదు

బ్యాంకులలో సీనియర్ సిటిజన్లకు సాధారణంగా 0.50శాతం అదనపు వడ్డీ ఇస్తారు. కానీ పోస్ట్ ఆఫీస్ టీడీలో అన్ని వయస్సుల వారికి ఒకే రకమైన వడ్డీ రేటు వర్తిస్తుంది. అంటే యువకులు కూడా సీనియర్ సిటిజన్లతో సమానంగా 7.5శాతం వడ్డీని పొందే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం హామీ ఉండే ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీ సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారు వెంటనే మీ సమీప పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌