ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో హనీమూన్‌కు వెళ్లిన విశాఖపట్నం ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హోమ్‌స్టే గదిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న గాయత్రి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో రికార్డింగ్‌తో పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలించారు. పెళ్లైన కొద్ది నెలలకే ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.