AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tenant Rules: అద్దె ఇంట్లో ఉంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే డేంజర్‌.. ముందే చూసుకోండి..

పట్టణాలు, నగరాల్లో అద్దె ఇళ్లల్లో ఉంటున్నారా.. అయితే మీరు ఈ విషయాల గురించి తెలుసుకోవాల్సిందే. అద్దె నియమాల గురించి తెలుసుకోకుండా దిగితే మీకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అద్దెదారులకు చట్టం ప్రకారం పలు హాక్కులు ఉన్నాయి. సెక్యరిటీ డిపాజిట్, అద్దె పెంపుకు పలు నిబంధనలు ఉన్నాయి.

Tenant Rules: అద్దె ఇంట్లో ఉంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే డేంజర్‌.. ముందే చూసుకోండి..
Rent House
Venkatrao Lella
|

Updated on: Jun 19, 2026 | 2:19 PM

Share

విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం లాంటి కారణాలతో తమ సొంతూరిని వదిలిపెట్టి నగరాలు, పట్టణాలకు వలసలు పోతుంటారు. సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటూ ఉంటారు. దేశంలో సుమారు 2.7 కోట్ల మంది ప్రజలు అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో అద్దెదారులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం చట్టాలను ప్రవేశపెట్టింది. అద్దెదారులకు అనేక హక్కులు కల్పించింది. ఈ నిబంధనలు గురించి అద్దె ఇళ్లల్లో ఉండేవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకోవాలి.

రెంటల్ అగ్రిమెంట్

మీరు ఇల్లు అద్దెకు తీసుకుంటుంటే యజమానితో రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. అంటే లిఖితపూర్వకంగా ఒప్పదం రాసుకోవాలి. రెంట్, సెక్యూరిటీ డిపాజిట్, నోటీస్ పీరియడ్, ఇతర నిబంధనల గురించి స్పష్టంగా రాసుకోవాలి. భవిష్యత్తులో ఏమైనా వివాదాలు ఏర్పడినప్పుడు మీకు ఇవి సహాయపడతాయి. అద్దెదారుడు, యజమానికి రికార్డు తరహాలో సహాయపడుతుంది. చాలా రాష్ట్రాలు ఆన్ లైన్ ద్వారా రెంటల్ అగ్రిమెంట్ ఆప్షన్ కల్పిస్తున్నాయి. ఇక సెక్యూరిటీ డిపాజిట్ గురించి తెలుసుకోండి. అదే అడ్వాన్స్ చెల్లింపు. ఆ ప్రాంతంలో అడ్వాన్స్ ఎంత తీసుకుంటున్నారనే విషయం గురించి తెలుసుకోండి.

అద్దె పెంపు నిబంధనలు

ఇక అద్దె పెంపు నిబంధనల గురించి ముందుగా తెలుసుకోండి. ఎన్ని నెలలకు, సంవత్సరాలకు అద్దె పెంచుతారనే విషయం గురించి అడగండి. అద్దె పెంపు ఎంత ఉంటుందనే సమాచారం తెలుసుకోండి. ఈ విషయాన్ని రెంటల్ అగ్రిమెంట్‌లో రాస్తే భవిష్యత్తులో అద్దె పెంపుకు సంబంధించి ఎలాంటి వివాదాలు ఉండవు. ఇక ఇంట్లో ఏదైనా సమస్య తలెత్తితే మరమ్మత్తులు, నిర్వహణ ఖర్చులు ఎవరు భరిస్తారనే విషయం గురించి తెలుసుకోండి. అద్దెదారులు, ఇంటి యజమాని మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు, అనవసరమైన వాదనలు రాకుండా ఇది నివారిస్తుంది. ఇక ఇంటిని బలవంతంగా ఖాళీ చేయమని హెచ్చరించే హక్కు యజమాని లేదు. కొన్ని నెలల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఒప్పందం గురించి తెలుసుకోండి.

Follow Us
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..