AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phonepe: ఫోన్ పేలో కొత్త రూల్.. ఇలా చేస్తే ప్రతీ మూడు నెలలకు రూ.100 ఫైన్..

ఫోన్ పే వాడేవారికి షాకింగ్ న్యూస్. ఫోన్ పే కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వ్యాలెట్ నిర్వహణపై ఛార్జీలను విధించనుంది. ఫోన్ పే వ్యాలెట్లు వాడేవారికి ఇది అదనపు భారమని చెప్పవచ్చు. వ్యాలెట్లపై నిర్వహణ ఛార్జీలను వసూలు చేయనుంది. వీటి గురించి పూర్తి వివరాలు ఇలా..

Phonepe: ఫోన్ పేలో కొత్త రూల్.. ఇలా చేస్తే ప్రతీ మూడు నెలలకు రూ.100 ఫైన్..
Phonepe
Venkatrao Lella
|

Updated on: Jun 19, 2026 | 1:46 PM

Share

ఫోన్‌పే వాడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే. ఫోన్‌పే వ్యాలెట్‌ను చాలామంది యాక్టివేట్ చేసుకుని ఉంటారు. ఈ వ్యాలెట్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోయినా ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. తక్కువ మొత్తం పరిమితి ట్రన్సాక్షన్లు వేగవంతంగా చేయవచ్చు. యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకపోవడం వల్ల వేగంగా ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. దీంతో చాలామంది ఫోన్‌పేలో వ్యాలెట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని ఉంటారు. ఇలాంటివారికి ఫోన్‌పే కొత్త నిబంధనలు విధించింది. ఫోన్‌పే వాలెట్‌ను యాక్టివేట్ చేశాక చాలామంది దానిని ఉయోగించరు. ఇలాంటివారికి ఫోన్‌పే జరిమానా విధించాలని నిర్ణయించింది.

ఛార్జి ఎంతంటే..?

మీరు చాలా రోజుల పాటు వ్యాలెట్ వాడకపోతే ఇనాక్టివ్ అవుతుంది. దీంతో ఇలాంటివారి నుంచి నిర్వహణ ఛార్జీలు విధించాలని ఫోన్ పే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇలా ఛార్జీలు విధించే విధానం లేదు. ఇప్పుడు కొత్తగా ఈ నిబంధనలను ఫోన్‌పే తీసుకొచ్చింది. ఇకపై ప్రతి మూడు నెలలకు రూ.100 (జీఎస్టీతో కలిపి) రుసుము విధించంచనుంది. దీనికి సంబంధించి వినియోగదారులను ఫోనో పే అలర్ట్ చేస్తోంది. ఈ మేరకు తమ కస్టమర్లకు నోటిఫికేషన్లు పంపిస్తోంది. వాలెట్ బ్యాలెన్స్ రూ.100 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఫోన్‌పే నేరుగా రుసుంలను తీసుకుంటుంది. రూ.100 కంటే తక్కువగా ఉంటే అందుబాటులో ఉన్న అమౌంట్‌ను కట్ చేసుకుంటుంది. ఈ రుసుంలు పడకుండా ఉండాలంటే ఏడాదిలో పలుమార్లు వ్యాలెట్‌ను ఉపయోగించాలి. వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేయడం, నగదు బదిలీ చేయడం లాంటివి చేయాలి.

ఎన్ని రోజుల తర్వాత ఇనాక్టివ్ అవుతుంది..?

వినియోగదారుడు తమ ఫోన్‌పే వాలెట్ ద్వారా వరుసగా 365 రోజుల పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోతే వాలెట్ ఇనాక్టివ్ అవుతుంది. అటువంటి వాలెట్‌లకు కంపెనీ ప్రతి మూడు నెలలకు రూ.100 జరిమానా విధిస్తుంది. వాలెట్ నిష్క్రియా నిర్వహణ రుసుముల కింద వీటిని వసూలు చేస్తుంది. ఇనాక్టివ్ ఖాతాలను నిర్వహించేందుకు అదనపు వనరులను వినియోగిస్తుంది. అందుకే అటువంటి వాలెట్లపై నిర్వహణ ఛార్జీని విధించాలని నిర్ణయించింది.

Follow Us