AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్రం సూపర్ గుడ్ న్యూస్.. కొత్త కార్డులపై ప్రకటన..

రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా అర్హులైనవారికి కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు.

Ration Card: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి కేంద్రం సూపర్ గుడ్ న్యూస్.. కొత్త కార్డులపై ప్రకటన..
Ration Card
Venkatrao Lella
|

Updated on: Jun 19, 2026 | 2:01 PM

Share

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి భారీ గుడ్ న్యూస్. పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రకటన జారీ చేసింది. త్వరలోనే అర్హులైనవారికి కొత్తగా రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి రేషన్ కార్డులు అందించే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పీడీఎస్ వ్యవస్థ నుంచి నుంచి 22.1 కోట్ల మందిని తొలగించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 8.5 కోట్ల మంది రేషన్ కార్డుదారులను రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాయని పేర్కొన్నారు. పీడీఎస్ జాబితా నుంచి అనర్హులైన రేషన్ కార్డుదారులను తొలగించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయని, కేంద్ర ప్రభుత్వం కాదని పేర్కొన్నారు.

రేషన్ కార్డుల తొలగింపు

దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నవారిలో 8.5 కోట్ల మంది అనర్హులు ఉన్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ గుర్తించింది. వీరిలో మరణించినవారితో పాటు పన్ను చెల్లింపుదారులు, కార్ కలిగి ఉన్నవారు ఉన్నారు. ఈ జాబితాను పరిశీలించాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్ర అధికారులు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పంపిన జాబితా నుంచి 2.21 కోట్ల పేర్లను తొలగించాయని కేంద్ర మంత్రి తెలిపారు. అంతేకాకుండా అర్హులైన లబ్ధిదారులను చేర్చే ప్రక్రియను రాష్ట్రాలు ప్రారంభించాయన్నారు. దీంతో రాష్ట్రాలు దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల అదనపు రేషన్ కార్డులను జారీ చేయనున్నాయని తెలిపారు. పీడీఎస్ జాబితా నుంచి రేషన్ కార్డుదారులను తొలగించే ప్రక్రియ అన్నిచోట్ల ఏకరీతిగా జరగలేదని కూడా కేంద్ర మంత్రి తెలిపారు. కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయనుండగా.. మరికొన్ని రాష్ట్రాలు అనర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తూనే ఉన్నాయని చెప్పారు.

దేశంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయంటే..?

దేశంలో సుమారు 79 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు పీడీఎస్ పథకం కింద 98.5 శాతం అర్హులైన లబ్ధిదారులకు సేవలు అందించామని తెలిపారు. ఈ పథకం కింద ఆధార్, ఇ-పీఓఎస్ యంత్రాల ద్వారా ధృవీకరణ అనంతరం ప్రయోజనాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

Follow Us
ఫ్రెండ్‌షిప్ డే.. మరో కొత్త వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
ఫ్రెండ్‌షిప్ డే.. మరో కొత్త వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?