AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కోసం నాగార్జున కళ్లు చెదిరే రెమ్యునరేషన్! ఏకంగా అన్ని కోట్లా?

బుల్లితెర ప్రేక్షకులను రంజిపంచేసేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఈసారి మరిన్ని హంగులు, విశేషాలతో 'దశావతారం కాన్సెప్ట్' అంటూ ముస్తాబవుతున్నాడు. ఇప్పటికే వరుసగా ప్రోమోలు, అప్టేట్స్ రిలీజ్ చేస్తూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పై మరిన్ని అంచనాలు పెంచుతున్నాడు.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కోసం నాగార్జున కళ్లు చెదిరే రెమ్యునరేషన్! ఏకంగా అన్ని కోట్లా?
Bigg Boss Telugu 10 Nagarjuna
Basha Shek
|

Updated on: Jun 19, 2026 | 6:04 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వస్తోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో బుల్లితెరపై రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే పదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారికంగా ప్రోమోలను కూడా రిలీజ్ చేశారు. గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ షో మరింత కలర్ ఫుల్ గా ఉండనుంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఈ రియాలిటీ షో ప్రారంభమై పదేళ్లయ్యాయి. అందుకే త్వరలోనే ప్రారంభమయ్యే ల్యాండ్ మార్క్ సీజన్ కోసం మరిన్ని హంగులు దిద్దనున్నట్లు సమాచారం. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి గేమ్స్, టాస్క్‌లు.. ఇలా అన్ని విషయాల్లోనూ ‘అంతకు మించి’ అని ఉండేలా బిగ్ బాస్ సీజన్ 10 కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ షోకు అసలైన బ్రాండ్ అంబాసిడర్ అక్కినేని నాగార్జున అని చెప్పవచ్చు. బిగ్ బాస్ తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు తన దైన వాక్చాతుర్యం, స్టైల్‌తో, వీకెండ్ క్లాసులతో బిగ్ బాస్ షోను టాప్ లో నిలుపుతున్నారు. నిజం చెప్పాలంటే నాగార్జున ఎంట్రీ ఇచ్చాకే ఈ రియాలిటీ షో మరింత రక్తి కట్టింది. టీఆర్పీ పరంగానూ అగ్రస్థానంలో నిలిచింది.

గత 7 సీజన్ల మాదిరిగానే పదో సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించున్నారు. ఈ నేపథ్యంలో కింగ్ రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జున రూ.35 కోట్ల భారీ పారితోషికం తీసుకున్నారని సమాచారం. అయితే ఈ ల్యాండ్ మార్క్ పదో సీజన్ కోసం నాగ్ తన రెమ్యునరేషన్ ను పెంచినట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన ఏకంగా రూ. 40 కోట్లకు పైగా ఫీజు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం టెలివిజన్ హిస్టరీలోనే ఒక టీవీ షో హోస్టింగ్‌కు ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్న హోస్ట్ నాగార్జునే అవుతారు.

ఇవి కూడా చదవండి

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధించి ఆసక్తికరమైన పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల వివాదంలో చిక్కుకున్న ఫేమస్ యూట్యూబర్ నందు, పల్లవి గౌడ, తేజస్విని గౌడ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, బుల్లితెర స్టార్ ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్‌లు కంటెస్టెంట్లుగా రానున్నారని తెలుస్తోంది. కాగా ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కానుందని సమాచారం.

బిగ్ బాస్ అగ్ని పరీక్ష..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us