జన నాయకుడు రిలీజ్ ను కావాలనే అడ్డుకుంటున్నారా..అసలు సమస్యేంటి..?
విజయ్ సీఎం అయ్యాక జననాయగన్ రిలీజ్ సులువు అవుతుందనుకున్నా, సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో ఆలస్యం అవుతోంది. సైనిక, మతపరమైన సన్నివేశాలపై అభ్యంతరాలున్నాయి. నిర్మాత పరిష్కారం కోసం ఢిల్లీ సెన్సార్ బోర్డుకు వెళ్లారు. విడుదల కాకుంటే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్.
దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత జననాయగన్ సినిమా విడుదల నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే, ఆయన సీఎంగా రెండు నెలలు అవుతున్నా, సినిమాకు మోక్షం లభించడం లేదు. సినిమా విడుదలపై నమ్మకాలు కూడా సన్నగిల్లుతున్నాయి. సెన్సార్ బోర్డు, జననాయగన్ చిత్రం మధ్య సాగుతున్న వివాదం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ సినిమా విడుదల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకునేందుకు నిర్మాత ఏకంగా ఢిల్లీలోని సెన్సార్ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. ఒకవేళ అక్కడ కూడా సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించకపోతే, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని మూవీ టీం నిర్ణయించుకుంది. గత కొద్ది నెలలుగా సెన్సార్ అధికారులతో ఎన్నిసార్లు మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో, చివరి ప్రయత్నంగా నిర్మాత ఢిల్లీకి బయలుదేరారు.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
మాయమైపోతున్న మాన్‌సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
జాహ్నవి తిరిగొస్తుందా? జ్ఞాని తిమ్మప్ప సంచలన వ్యాఖ్యలు
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..

