క్యూట్ లుక్ తో కట్టిపడేస్తున్న కోమలి ప్రసాద్.. 

19 June 2026

Pic credit - Instagram

Rajeev 

తెలుగమ్మాయి కోమలి ప్రసాద్ తన అందంతో, నటనతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది. సినిమాల్లోకి రాక ముందు ఈ చిన్నది డెంటిస్ట్ గా చేసింది. 

ప్రస్తుతం కోమలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కోమలి ప్రసాద్ 2016లో నేను సీతాదేవి అనే తెలుగు సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది.

 ఆ తర్వాత 2020లో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, సెబాస్టియన్ పి.సి.524 సినిమాలు చేసింది. ఈ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. 

 2022లో ఆమె వెబ్ సిరీస్ లూజర్‌, లూజర్ 2 లలో, ఫైండింగ్ యువర్ పెంగ్విన్‌లో మోడరన్ లవ్ హైదరాబాద్ అనే ఆంథాలజీ సిరీస్‌లో కూడా కనిపించింది. 

  రక్షిత్ అట్లూరి హీరోగా  శశివదనే అనే సినిమాలోనూ నటించింది. ఇక ఈ అమ్మడికి మంచి క్రేజ్ తెచ్చిన సినిమా అంటే హిట్ 2 అనే చెప్పాలి. 

ఆతర్వాత నాని నటించిన హిట్ 3లోనూ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది కోమలి ప్రసాద్ 

ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా గడుతుంది ఈ అందాల తార. అలాగే సోషల్ మీడియాలోనూ ఫొటోలతో కవ్విస్తుంది.