కృష్ణానగర్ కష్టాలు.. ఇరుకు గదుల్లో ఉంటూ.. ఫ్రెష్ అవ్వడానికి మాల్స్‌కు వెళ్లేవాళ్లం..
కమెడియన్ నెల్లూరు సుదర్శన్ తన సినిమా ప్రయాణానికి ముందు కృష్ణానగర్‌లో పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. నీటి సమస్యలు, అద్దె కట్టక బిగ్ బజార్ వాష్‌రూమ్‌లు వాడిన రోజులు, స్నేహితుడు శ్రీకాంత్ సహాయం, కుమారి 21Fతో వచ్చిన అవకాశం, డేట్స్ క్లాష్‌తో కోల్పోయిన సినిమాల గురించి వివరించాడు

తెలుగు సినిమా రంగంలో హాస్యనటుడిగా తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తున్న నెల్లూరు సుదర్శన్ (సుదర్శన్ రెడ్డి). నెల్లూరు యాసలో కామెడీ పండిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు సుదర్శన్. ఇటీవల విడుదలవుతున్న సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు సుదర్శన్. కమెడియన్ గా స్టార్ డమ్ అందుకోకముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు సుదర్శన్. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ కమెడియన్స్ లో ఒకడిగా నిలిచాడు. కాగా తన సినీ ప్రస్థానానికి ముందు అనుభవించిన కష్టాలను గతంలో ఇంటర్వ్యూలో వివరించారు. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన సుదర్శన్, యూసఫ్‌గూడ బస్తీలోని చిన్న రూములలో స్నేహితులతో కలిసి ఉన్నాడట. ఒక ఒక్క చిన్న రూమ్ లో నలుగురం ఉండేవాళ్ళం.. అప్పుడు 5,000 రూపాయల అద్దెను కూడా కట్టలేని స్థితి. దానికి తోడు నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ, అద్దె కట్టకపోవడంతో ఇంటి యజమానిని నీటి కోసం అడగలేని పరిస్థితి. ఉదయం లేవగానే 10 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురుచూసి, బిగ్ బజార్ తెరుచుకోగానే వాష్‌రూమ్‌కు వెళ్లేవాళ్లం. అని తెలిపాడు సుదర్శన్.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్
అలాగే సుదర్శన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎవరూ పరిచయం లేకపోవడం, ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఈ ఒంటరితనం మరింత భారంగా అనిపించేది. మొదట సినిమా అవకాశాలు రాకముందు, చిన్న చిన్న గదుల్లో లగేజీలు నిలబెట్టుకొని నిద్రపోయిన రోజులు, పప్పు అన్నం తింటూనే మధ్యాహ్నం, రాత్రి గడిపిన రోజులు సుదర్శన్ గుర్తుచేసుకున్నాడు. తొలి సంపాదనగా 3,000 రూపాయలు వచ్చిన తర్వాతనే ఆర్థిక ఇబ్బందులు కొంత తగ్గాయి. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా నడుచుకుంటూనే వెళ్లేవారు. హెడ్‌సెట్ పెట్టుకొని, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని తిరుగుతూ కాలక్షేపం చేసేవాడిని. కృష్ణానగర్‌లో ఒక కాఫీ లేదా టీ తాగడానికి కూర్చుంటే, గంటల తరబడి పేపర్ చదువుతూ కూర్చునేవాడిని అని తెలిపాడు సుదర్శన్.
ఇది కూడా చదవండి : మల్లీ ఎంత మారిపోయింది.!! ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు
సుదర్శన్ సినీ ప్రయాణంలో శ్రీకాంత్ అనే స్నేహితుడు ఎంతో అండగా నిలిచాడు. శ్రీకాంత్ లేకపోతే తాను సినిమా ఇండస్ట్రీకి రాగలిగేవాడిని కాదని, అతనే అనేక పరిచయాలు, అవకాశాలు చూపించాడని సుదర్శన్ తెలిపాడు. శేఖర్ రాజా, ఊ కొడతారా ఉలిక్కిపడతారా డైరెక్టర్‌తో పరిచయాలు శ్రీకాంత్ ద్వారానే లభించాయి అని తెలిపాడు. కుమారి 21 ఎఫ్ సినిమా సుదర్శన్‌కు ఒక పెద్ద బ్రేక్. పది రోజుల ముందు ఆ సినిమాకు పిలిచి అవకాశంకూడా ఇచ్చారని, సుకుమార్, సూర్యప్రతాప్ తనపై నమ్మకం ఉంచారని సుదర్శన్ గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వచ్చాయని తెలిపాడు. ఇక ఇప్పుడు డేట్స్ ఖాళీ లేక కొన్ని మంచి ఆఫర్స్ మిస్ అయ్యాయి అని తెలిపాడు సుదర్శన్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి :అంత అందమైన బ్యూటీని ఇలా మార్చేశారేంట్రా బాబు..!! ఈ అందాల తారను గుర్తుపట్టారా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




