AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

430కుపైగా సినిమాలు.. కోట్ల డబ్బు..! కానీ అంత్యక్రియలకు కూడా రూపాయిలేక చివరకు..

సినీరంగంలో చాలా మంది నటీనటులు తమ సహజ నటనతో సినీప్రియులను అలరించారు. ముఖ్యంగా తమ యాక్టింగ్, పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు కొందరు కమెడియన్స్. తెలుగులో కొన్ని వందల చిత్రాల్లో నటించి మెప్పించారు. నటనతో అలరించిన పలువురు హాస్య నటీనటుల జీవితాలు మాత్రం అసలు ఊహించని విధంగా గడిచాయి.

430కుపైగా సినిమాలు.. కోట్ల డబ్బు..! కానీ అంత్యక్రియలకు కూడా రూపాయిలేక చివరకు..
Kalpana Rai
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2026 | 12:00 PM

Share

తెలుగు సినీ ప్రేక్షకులను తన అద్భుతమైన హాస్యం, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో దశాబ్దాల పాటు అలరించిన నటీనటుల్లో కల్పనా రాయ్ ఒకరు. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలో, కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు కల్పనా రాయ్. కానీ ఆమె జీవితం సినిమా కథను తలపించే విషాదాంత గాథ. కల్పనా రాయ్ అసలు పేరు సత్యవతి. 1942లో కాకినాడలో జన్మించిన ఆమె జీవితం ఊహించని మలుపులతో సాగింది. బాల్యంలో ఇంటి ముందు రామాలయంలో జరిగిన నాటకాన్ని చూసి నటన పట్ల ఆకర్షితురాలైంది. కొన్ని రోజుల తర్వాత గ్రామం దగ్గరలో నటి శారద సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఆమెను చూడటానికి వందల మంది అభిమానులు వచ్చారు. శారదను చూసిన సత్యవతికి సినిమాల్లోకి రావాలనే బలమైన కోరిక కలిగింది. ఆ కసితో, పట్టుదలతో సినీ రంగంలో అడుగుపెట్టింది. మోహన్ రాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కల్పనా రాయ్‌గా మారి, తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. నటి శారద అంటే ఆమెకు ఎనలేని అభిమానం. ఆమెనే తన స్ఫూర్తిగా భావించి సినిమాల్లోకి వచ్చారు కల్పనా రాయ్.

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

“నీడలేని ఆడది” సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన కల్పనా రాయ్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల కొద్దీ సినిమాల్లో నటించారు. ఆమె నటించిన ప్రతి సినిమా కూడా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. మొదట “ఓ సీత కథ” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె, ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన “జంబలకిడి పంబ” సినిమా ద్వారా మంచి గుర్తింపును అందుకుంది. ఇలా 430కు పైగా చిత్రాల్లో నటించింది. ఆమె చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ, ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేలా తనదైన ముద్ర వేసుకున్నారు.

ఇది కూడా చదవండి : మల్లీ ఎంత మారిపోయింది.!! ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు

కల్పనా రాయ్ గొప్ప దయాగుణం కలిగిన మనిషి. ఎవరైనా బాధలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటే, క్షణం కూడా ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చేది. తన దానధర్మాల వల్ల ఉన్న బంగారం, ఆస్తి అంతా కరిగిపోయినా, ఆమె మాత్రం తన తీరు మార్చుకోలేదు. అప్పు చేసైనా సరే అందరికీ భోజనం పెట్టేది. ఆ మంచి తనమే ఆమెకు శాపంగా మారింది. డబ్బు పోగానే అందరూ దూరమయ్యారు. చివరకు తన నెలవారీ ఖర్చులకు సరిపోయే రెమ్యునరేషన్ కూడా ఎవరైనా అడగ్గానే ఇచ్చేసేవారట.. ఈ దానగుణమే ఆమెను చివరి రోజుల్లో ఇబ్బందులకు గురిచేసింది. అంతకంటే పెద్ద విషాదం కూతురు ప్రేమించిన వ్యక్తితో పారిపోవడం. అప్పుడు కల్పనా పడ్డ బాధ వర్ణనాతీతం. ప్రాణంగా పెంచుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. అప్పుడే ఆమె మనిషిగా సగం చనిపోయింది. ఉన్న డబ్బు కూడా ఆవిరవ్వటంతో పలకరించే నాధుడే కరువయ్యాడు. ఒంటరిగా మిగిలిపోయింది. చివరి రోజుల్లో మాత్రం ఆమెకు డబ్బులు అవసరమైనప్పుడు ఎవరూ సహాయం చేయలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో చికిత్సకు డబ్బులు లేక అలాగే మరణించింది. చివరకు ఆమె అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు. అంత దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకు వచ్చి పదివేల రూపాయలు అంత్యక్రియల కోసం ఇచ్చింది. 2008వ సంవత్సరంలో హైదరాబాద్‌లోని ఇందిరా నగర్‌లో ఆమె తుది శ్వాస విడిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అంత అందమైన బ్యూటీని ఇలా మార్చేశారేంట్రా బాబు..!! ఈ అందాల తారను గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us