AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ప్రోటీన్ దోశ ఇంట్లో సులభంగా ఎలా చేయాలంటే?

స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. దీంతో వారికి మంచి పోషకాలు ఉన్న ఫుడ్ అందించాలని తల్లి ఎంతగానో ఆరాటపడి పోతుంది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే పిల్లలకు ఆరోగ్యాన్నిచ్చే ప్రోటీన్ దోశ ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 19, 2026 | 10:27 AM

Share
కావాల్సిన పదార్థాలు : పెసర్లు ఒక కప్పు, రాగులు ఒక కప్పు,  బియ్యం రెండు కప్పులు, అల్లం చిన్న ముక్క , రుచికి సరిపడ ఉప్పు, నెయ్యి, శనగపప్పు, మెంతులు.

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా పెసర్లు ఒక కప్పు, రాగులు ఒక కప్పు తీసుకొని మంచిగా శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బియ్యం తీసుకొని వాటిని రెండు నుంచి మూడు నిమిషాల వరకు శుభ్రంగా కడిగి, తర్వాత వీటిలో నీరు పోసి మంచిగా నాబెట్టుకోవాలి, రాగులు , పెసర్లు కూడా నానబెట్టుకోవాలి.

2 / 5
తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు, వన్ స్పూన్ మెంతులు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. దాదాపు ఏడు నుంచి ఏనిమిది గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. బాగా మంచిగా నాని తర్వత వీటిని మరోసారి మంచినీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టిన పప్పు, రాగులు, బియ్యం అన్నీ వేసుకొని మంచిగా చాలా మెత్తగా దోశలు పోసుకోవడానికి అనుగుణంగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే, అంత మంచిగా దోశలు వస్తాయి.

4 / 5
ఇక మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా, బయట ఈ పిండిని పెట్టి, దానిలో ఉప్పు కలపకూడదు, దాదాపు 8 గంటలపాటు ఉంచాలి. దీని వలన అది పులిగి దోశలు అద్భుతంగా వస్తాయి. ఇప్పుడు వాటిని దోశలు వేసి పిల్లల లంచ్ బాక్స్‌లో పెడితే టేస్ట్ అదిరిపోతుంది. అంతే కాకుండా మంచి ప్రోటీన్ అందుతుంది.

5 / 5
Follow Us
గ్యాస్, ఎసిడిటీకి చెక్.. బరువు తగ్గడానికి ఈ డ్రింక్ ఎలా చేయాలంటే

Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, ఉద్యోగ యోగం..

వేపుళ్లకు వాడిన నూనెతో ఏం చేయొచ్చో తెలిస్తే ఇంకెప్పుడూ పారేయరు

తెలుగు రాష్ట్రాలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్ హైవే.. వారంలో ప్రారంభం..

శ్రీలంక టూర్‌లో హఠాత్తుగా మారిన షెడ్యూల్..బీసీసీఐ షాకింగ్ నిర్ణయం

కామన్వెల్త్‌ గేమ్స్‌.. బాక్సింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు

సుద్ద నేలలో చురకైన పంట ఇది.. భలా రైతన్న...

అరటిపండు తొక్కలకు కొద్దిగా వెనిగర్ కలిపితే జరిగే మ్యాజిక్ ఇదే..

దొరికితే వదలకండి : వంద రోగాలకు ఒకే మందు.. పాత కాలం వారి బలం

భోజనం చేసిన పళ్లెంలోనే చేతులు కడుక్కుంటున్నారా? ఈ పొరపాటు..