AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసింది..

కొన్ని సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఏ జోనర్ సినిమా అయినా.. ఒక్కసారి కంటెంట్ బాగుందే ఆడియన్స్ ఆ సినిమాని గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో ఈ సినిమా ఒకటి.. ఈ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.

ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేసింది..
Movie
Rajeev Rayala
|

Updated on: Jun 19, 2026 | 11:36 AM

Share

దర్శకుడు వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకొని సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరించారు దర్శకుడు వంశీ. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఓ అద్భుతమైన సినిమా అన్వేషణ. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక విభిన్నమైన, అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిలిచిపోయింది. ప్రముఖ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ ఈ సినిమా నిర్మాణ విశేషాలు, వంశీ దార్శనికత, ఇళయరాజా అసమాన సంగీత దర్శకత్వం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. వంశీ అంతకుముందు మంచు పల్లకి, సీతార వంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. అయితే అన్వేషణతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. అవే కళ్ళు వంటి సస్పెన్స్ చిత్రాల ప్రభావంతో పాటు, ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో ఒక జెకోస్లోవేకియన్ సినిమా చూసి, అడవి నేపథ్యంలో భయానక వాతావరణం సృష్టించాలనే ఆలోచన వంశీకి వచ్చిందట.

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో చేయిపెడితే రూ. 100కోట్లు వచ్చి పడతాయి.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

కన్నడ చిత్రం అపరిచితను చూసి, దాన్ని కాపీ చేయకుండా, దానికంటే గొప్ప థ్రిల్లర్ తీయాలనే తపనతో అన్వేషణ కథను రూపొందించారు. కథ ఇంకా పూర్తి కాకముందే, వంశీ గారు అన్వేషణ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. కథ రాయడంలో ఇబ్బందులు పడిన వంశీ గారు, నిర్మాతలను ఒప్పించి అరకుకు బయలుదేరారు. 15 రోజులు అరకులో ఒంటరిగా, ప్రకృతితో మమేకమై స్క్రిప్ట్ రాసుకున్నారు. ఒక పచ్చటి ఫైల్‌లో తన ఆలోచనలను నింపుకొని తిరిగి వచ్చారు. ఇక హీరోయిన్ భానుప్రియ గ్లామరస్ పాత్ర చేయాలని కోరగా, వంశీ గారు ఆ డిమాండ్‌ను సినిమాలో భాగంగా చేసుకుని కూరగాయలతో అలంకరించిన నేనవ్వే జాస్మిన్ వైట్ పాటను చిత్రీకరించారు.

ఇది కూడా చదవండి : మల్లీ ఎంత మారిపోయింది.!! ఆర్ఆర్ఆర్‌లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు

అన్వేషణ విజయానికి ఇళయరాజా సంగీతం ఒక ప్రధాన కారణం. మధురైలో కంపోజింగ్ కోసం వెళ్లినప్పుడు, వంశీ దగ్గర పూర్తి స్క్రిప్ట్ లేదు. కేవలం కొన్ని సన్నివేశాల వివరణ మాత్రమే ఉంది. పక్షుల కిలకిలరావాలు, అటవీ నేపథ్యం, ఒక యువతిపై జరిగిన అత్యాచారం, తదనంతరం జరిగే ఇన్వెస్టిగేషన్ వంటి సన్నివేశాలను వంశీ నోటిమాటగా వివరించగా, ఇళయరాజా గారు అప్పటికప్పుడే అద్భుతమైన ట్యూన్స్‌ను కంపోజ్ చేశారు. సినిమా పూర్తయిన తర్వాత రీరికార్డింగ్ కోసం ఇళయరాజాకి చూపించినప్పుడు, ఆయన సైలెంట్‌గా సినిమా చూసి, ఏమీ మాట్లాడకుండా కారులో వెళ్ళిపోయారట. మరుసటి రోజు నుంచే నేపథ్య సంగీతం పని మొదలుపెట్టారు. ఈ సంఘటన ఇళయరాజా ప్రొఫెషనలిజానికి, వంశీ విజన్‌ను అర్థం చేసుకున్న తీరుకు నిదర్శనం. సినిమాలో కేవలం నాలుగు పాటలు ఉన్నా, నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. తలకోన అడవుల్లో మొట్టమొదటిసారి షూటింగ్ చేసిన సినిమా అన్వేషణ. ఈ సినిమాను ఇండస్ట్రీ మొత్తం అట్టర్ ఫ్లాప్ అన్నారు, కానీ ఆతర్వాత బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాదు ఇండస్ట్రీనే గొప్ప థ్రిల్లర్ గా నిలిచింది ఈ సినిమా. అన్వేషణ వంశీ సృజనాత్మక ప్రయాణంలో ఒక మైలురాయి, ఇళయరాజా గారి సంగీత విన్యాసానికి ఒక వేదిక అని చిల్లగట్టు శ్రీకాంత్ తన విశ్లేషణలో ముగించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అంత అందమైన బ్యూటీని ఇలా మార్చేశారేంట్రా బాబు..!! ఈ అందాల తారను గుర్తుపట్టారా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us