UK యూత్ పార్లమెంట్‌లో తెలుగు వెలుగు.. ప్రపంచ వేదికపై వైజాగ్ అమ్మాయి సత్తా
Kalasha Naidu Success Story: 'కలలు కనాలి... ఆ కలలను సాకారం చేసుకోవాలి.. అప్పటివరకు శ్రమించాలి..' ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాట. ఆ మాటలను జీవిత బాటలుగా మార్చుకొని ప్రపంచ వేదికపై మెరిసింది ఓ యువతి. విశాఖలో పుట్టి... అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగి అందరి మన్ననలు అందుకుంటుంది. యువత ఆశయాలకు ప్రతినిధిగా నిలుస్తూ యూకే యూత్ పార్లమెంట్ సభ్యులుగా గుర్తింపు పొందింది. ఇంతకీ అంతర్జాతీయ వేదికలపై వెలుగుతున్న ఆ తెలుగు యువతి ఎవరు..? వైజాగ్ టు యూకే.. ఆమె ప్రయాణం ఎలా సాగింది..?

విశాఖకు చెందిన కలశనాయుడు చిన్నతనం నుంచి ఏదో సాధించాలనే తపన. అందరికంటే కాస్త భిన్నంగా ఆమె ఆలోచన. నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. విద్యలో సరికొత్త ప్రమాణాలు అంతర్జాతీయ వేదికలపై భారతీయ ప్రతిభకు గుర్తింపు తెచ్చేలా శ్రమించారు. భవిష్యత్తులకు ఆదర్శంగా నిలిచే యువశక్తిగా ఎదిగారు ఆమె. నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
చిన్ననాటి నుంచే సమాజం పట్ల బాధ్యత, విద్య పట్ల ఆసక్తి, నాయకత్వ లక్షణాల పట్ల మక్కువ ఆమెను ఇతరుల కంటే భిన్నంగా సమాజంలో నిలబెట్టాయి. విశాఖ కు చెందిన కలశనాయుడు.. విభిన్న రంగాల్లో ఆమె ప్రతిభ గుర్తింపు ఆమె స్వస్థలం నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. విశాఖ సంస్కృతి, భారతీయ విలువలు, ప్రపంచ దృక్పథం అనే మూడు అంశాలను సమన్వయం చేసుకుంటూ.. ఆమె పురోగతి సాధించి యువతకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. సాధారణ కుటుంబం నుంచి.. ప్రపంచ గుర్తింపు పొందిన వెనుక ఆమె కృషి, అంకిత భావం, పట్టుదల తోనే సాధ్యమయ్యాయి. ఆమెను యూకే యూత్ పార్లమెంట్లో.. సభ్యురాలిగా గుర్తింపు దక్కింది.
కలశ నాయుడు చిన్ననాటి నుంచి సమాజం కోసం పరితపించింది. కలశ నాయుడు ఆగస్టు 13, 2013 పుట్టి.. తనకు సమాన వయసులో ఉండే పసిపిల్లలు పలక, బలపం పట్టుకోవల్సిన చేతులు పని ముట్లను పట్టుకోవడాన్ని చూసి తల్లడిల్లి పోయింది. తన వంతు సేవ చేయాలని ధాతృత్వాన్ని చాటుకుంది. అలా కష్టపడుతున్న చిన్నారులకు పలకలు, బలపాలు, చాక్లెట్లు, పెన్సిళ్లు, నోట్ బుక్‌లు, ఆట బొమ్మలు అందించింది. వీటితో పాటు వెల కట్టలేనంత ప్రేమను పంచింది. దీంతో ఈమె సేవాభావాన్ని గుర్తించిన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ 11 ఏళ్ల సమయంలో డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయసులోనే డాక్టరేట్ బిరుదును పొందిన తొలి చిన్నారిగా రికార్డుకు ఎక్కింది. బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్‌లోని ఇండియన్ హైకమీషనర్తోపాటు అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించింది.
విద్యా, విజ్ఞానం, సామాజిక సేవ, నాయకత్వం అనే నాలుగు రంగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కలసానాయుడు. యువత కేవలం భవిష్యత్ నాయకులు మాత్రమే కాదు ప్రస్తుత సమాజ మార్పులో కూడా కీలక భాగస్వాములను ఆమె నిరూపిస్తున్నారు. ఆమె కార్యాచరణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ… ప్రపంచ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ప్రేరణ కల్పిస్తుంది. అతి చిన్న వయసులోనే గ్లోబల్ గా వివిధ దేశాల యువ నాయకులతో కలిసి పని చేసిన ఆమె… విద్య, ఉపాధి, మానసిక ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చల్లో పాల్గొన్నారు.
యూకే యూత్ పార్లమెంట్లో యువ తెలుగు వెలుగు ప్రస్థానం..
ప్రజాస్వామ్య వ్యవస్థలో యువతకు ప్రధానం కల్పించే ప్రతిష్టాత్మక వేదికలో యూకే యూత్ పార్లమెంట్ ఒకటి. అటువంటి వేదికల్లో సభ్యులుగా నిలవడం డాక్టర్ కలశానాయుడు ప్రతిభకు నిదర్శనం. యువత సమస్యలు విద్య ఉపాధి సామాజిక న్యాయం మానసిక ఆరోగ్యం సమాన అవకాశాలు వంటి అంశాలపై యువత అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చేరవేసే బాధ్యతను ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన యువ నాయకులతో కలిసి పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో చర్చల్లో కలవడం ఆమె నాయకత్వ పరిధిని మరింత విస్తరించింది. యువత స్వరాన్ని అధికారిక వేదికల వరకు తీసుకెళ్లగల సామర్థ్యం కలిగిన కలశానాయుడు గుర్తింపు పొందడం తెలుగు యువతకు గర్వకారణం.
సామాజిక సేవను లక్ష్యంగా ఎంచుకున్న కలశనాయుడు సేవా భవాని చిన్నప్పటి నుంచి అలవర్చుకున్నారు. ఆమె సేవాభావాన్ని చూసి పేరెంట్స్ కూడా ప్రోత్సహించారు యువత అభివృద్ధి మహిళా సాధికారత విద్య అవకాశాల విస్తరణ సామాజిక చైతన్యం వంటి అంశాల్లో ఆమె నిరంతరం పనిచేస్తున్నారు. వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పన , యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, ప్రజాస్వామ్య వ్యవస్థ పై అవగాహన పెంచడం వంటి కార్యక్రమాల ద్వారా ఆమె సేవా భావాన్ని మరింత చాటుకుంటున్నారు. సమాజ సమస్యలను కేవలం చర్చించడమే కాకుండా వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆమె నమ్మకం. అందుకే కలశానాయుడు కార్యక్రమాలు యువతలో సానుకూల మార్పుకు దారితీస్తున్నాయి.
యూకే యూత్ పార్లమెంట్ అంటే..
యువత గొంతుకకు ప్రజాస్వామ్యంలో ప్రాధాన్యత కల్పించాలని లక్ష్యంతో ఏర్పడిన ప్రతిష్టాత్మక వేదిక యూకే యూత్ పార్లమెంట్. బ్రిటన్ లోని యువత ఆలోచనలు సమస్యలు ఆశయాలు అభిప్రాయాలను ప్రభుత్వానికి పార్లమెంటుకు చేరవేసే ప్రజాస్వామ్య సంస్థగా యూకే యూత్ పార్లమెంట్ గుర్తింపు పొందింది. 11 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు మధ్య గల యువతకు ప్రాతినిధ్యం కల్పిస్తూ.. వారి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను సూచించే వేదికగా ఈ యూకే యూత్ పార్లమెంట్ పనిచేస్తుంది. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం సామాజిక బాధ్యత పెంచడం ప్రజాస్వామ్య వ్యవస్థ పై అవగాహన కల్పించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు.
యూకే యూత్ పార్లమెంటుకు చెందిన సభ్యులు ప్రపంచ దేశాల నుంచి ఎన్నికవుతారు. వారిలో ఒకరు విశాఖకు చెందిన కలశనాయుడు. వీరు ఏడాది పొడవునా తమ ప్రాంతాల్లో యువత సమస్యలపై పనిచేస్తూనే జాతీయస్థాయి సమావేశంలో పాల్గొంటారు. లండన్ లోని బ్రిటిష్ పార్లమెంటు భవన సముద్రంలో ప్రత్యేక సమావేశంలో నిర్వహించడం ఈ సంస్థకు అత్యంత గౌరవప్రదమైన అంశంగా భావిస్తారు. సాధారణంగా దేశ భవిష్యత్తు విధానాలకు సంబంధించిన అంశాలపై చర్చలు ఓటింగ్ తీర్మానాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి.
వాస్తవానికి యువత అభిప్రాయాలకు మరింత ప్రధాని కల్పించాలని ఉద్దేశంతో 1999లో యూకే యూత్ పార్లమెంటు స్థాపించారు. ప్రారంభ దశలో పరిమిత స్థాయిలో ఉన్న ఈ సంస్థ.. కార్యక్రమంలో బ్రిటన్ లోని అత్యంత ప్రభావంతమైన యువజన ప్రజాస్వామ్య వేదికగా జరిగింది. రెండు దశార్థులకు పైగా కొనసాగుతున్న ఈ సంస్థ వేలాది మంది యువ నాయకులను తీర్చిదిద్దింది. బ్రిటన్ రాజకీయ సామాజిక రంగంలో కీలక స్థానాల్లో ఉన్న పలువురు వ్యక్తులు తమ ప్రజా జీవితాన్ని యూకే యూత్ పార్లమెంట్ నుంచే ప్రారంభించారు.
ఎందుకు ఏర్పాటయిందంటే..
యువత ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి చేరవని అభిప్రాయం నుంచి ఈ సంస్థ ఆవిర్భవించింది. ఉపాధి అవకాశాలు, విద్యా విధానాలు, వాతావరణ మార్పులు, మానసిక ఆరోగ్యం, యువత సంక్షేమం, డిజిటల్ భద్రత, సామాజిక న్యాయం వంటి అంశాలపై యువత అభిప్రాయాలను నేరుగా పాలకులకు చేరవేరాలని ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. యువత కేవలం భవిష్యత్తు పౌరులు మాత్రమే కాకుండా నేటి సమాజ నిర్మాణంలో భాగస్వాములనే భావనకు ఈ వేదిక పనిచేస్తుంది. యూకే యూత్ పార్లమెంట్ సభ్యుల ఎంపిక పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతుంది. వివిధ ప్రాంతాల్లో అర్హులైన యువత ఎన్నికల్లో పోటీ చేస్తారు. అదే ప్రాంతానికి చెందిన యువ ఓటర్లు తమ ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారిని మెంబర్స్ ఆఫ్ యూకే యూత్ పార్లమెంట్ – ఎం వై పి లుగా పిలుస్తారు. ఎన్నికైన సభ్యులు తమ ప్రాంత యువత సమస్యలను గుర్తించి వాటిని జాతీయస్థాయిలో ప్రస్తావిస్తారు. ఈ విధానం ద్వారా యువతకు చిన్న వయసులోనే ప్రజాస్వామ్య ప్రక్రియలపై అవగాహన పెరగడంతో పాటు నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
నేటి ప్రపంచంలో ఒక దేశానికే పరిమితమైన ఆలోచనలు సరిపోవు. ప్రపంచ సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరముంది. డాక్టర్ కలశానాయుడు ఈ భావనకు ప్రతిరూపం. ప్రపంచ పౌరసత్వం అంటే కేవలం విదేశాలలో నివాసం కాదు ప్రపంచ శ్రేయస్సు కోసం ఆలోచించడం, వివిధ సంస్కృతులను గౌరవించడం, మానవతా విలువలను కాపాడడం ఈ లక్షణాలను కార్యచరణ చేసుకుంటూ కొత్త తరానికి ఆమె డిసైనిర్దేశం చేస్తున్నారు. ప్రపంచ వేదికలపై భారతీయ యువత సామర్థ్యాన్ని చాటుతోనే ప్రపంచ సమస్యల పరిష్కార లో భాగస్వామ్యం కావాలని యువతను ప్రోత్సహిస్తున్నారు. విద్య అనేది కేవలం వ్యక్తిగత పురోగతిగా కాదు సమాజ మార్పునకు కూడా శక్తివంతమైన సాధనం. ఈ సత్యాన్ని డాక్టర్ కలశానాయుడు నిరూపిస్తున్నారు. విజ్ఞానాన్ని సేవతో మేళవించిన ఆమె నాయకత్వం కలస నాయకుడికి ప్రపంచ వేదికపై ప్రత్యేకంగా నిలబెడుతుంది.




