AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎందుకు చంపావ్ నాన్నా..’ ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య దూరంగా వెళ్లిపోయిందన్న మనస్తాపంతో తండ్రి సుధాకర్‌ తన ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

'ఎందుకు చంపావ్ నాన్నా..' ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఆత్మహత్య
Father Kills Daughters In Prakasam
Fairoz Baig
| Edited By: |

Updated on: Jun 19, 2026 | 12:35 PM

Share

చీమకుర్తి, జూన్‌ 19: ప్రకాశంజిల్లా చీమకుర్తి మండలం కె.వి అగ్రహారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు కూతుళ్లను చంపి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి సుధాకర్. ముగ్గురు కూతుళ్లు అచ్యుత(11), పూజిత (9), లోహిత (8)లుగా గుర్తించారు. ఈ దారుణ ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. భార్య వదిలేసి వెళ్లిందన్న మనస్థాపంతో ముగ్గురు కూతుళ్లను చంపి అనంతరం తండ్రి సుధాకర్‌ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.

ఓ గ్రానైట్ క్వారీలో బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న సుధాకర్‌కు భార్యకు మధ్య గత కాలంగా విబేధాలు నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు భార్యను తిరిగి తీసుకొచ్చేందుకు సుధాకర్‌ ప్రయత్నించి విఫలమయ్యాడు. తన తల్లితో కలిసి ఉంటున్న సుధాకర్‌ ముగ్గురు కూతుళ్ళను వదిలేసి వెళ్ళిపోయిన భార్యపై కోపంతో క్షణికావేశంలో తన ముగ్గురు కూతుళ్ళను చంపి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. ఈరోజు ఉదయం ముగ్గురు కూతుళ్లు నిద్రపోతున్నారని, వాళ్ళను ఇప్పుడు లేపవద్దని తన తల్లికి చెప్పాడు.

ఇవి కూడా చదవండి

కూతుళ్ళ కోసం బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకొస్తానని తన తల్లితో చెప్పి బయటకు వెళ్లిన సుధాకర్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మంచంపై నిద్ర పోతున్న స్థితిలోనే చనిపోయి పడిఉన్న ముగ్గురు కూతుళ్ళ ఒంటిపై గాయాలు లేకపోవడంతో విషమిచ్చి లేదా గొంతు నులిమి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us