AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఒక్క రోజులోనే కొత్త పాన్ కార్డ్.. అంతా ఫ్రీ..

తక్షణమే పాన్ కార్డు అవసరమా.. కొత్తగా పాన్ కార్డు పొందాలా.. అయితే కొన్ని నిమిషాల్లోనే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జస్ట్ ఆధార్ కార్డు నెంటర్ ఉంటే చాలు. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖ ఈ-పాన్ సౌకర్యం కల్పిస్తోంది. ఈ ప్రాసెస్ ఎలా అంటే..

Pan Card: ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఒక్క రోజులోనే కొత్త పాన్ కార్డ్.. అంతా ఫ్రీ..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Aug 11, 2026 | 12:44 PM

Share

ఆధార్ కార్డు తర్వాత దేశంలో నివసించేవారికి అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పాన్ కార్డ్. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాలంటే ఇది తప్పనిసరి. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ అనేది ప్రతీఒక్కరికీ అవసరం. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి, అధిక విలువ కలిగిన కొన్ని ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి ఇది అవసరం. అయితే మీ వద్ద పాన్ కార్డు లేకపోతే ఈ-పాన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి నుండే ఆధార్ ద్వారా తక్షణ ఇ-పాన్ (e-PAN) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ, పాన్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో సులువుగా పొందవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

ఆధార్ ద్వారా ఇ-పాన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ ఆధార్ నంబర్ చెల్లుబాటులో ఉందా.. లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఆధార్‌తో మీ మొబైల్ నంబర్ లింక్ చేసి ఉండాలి. అలాగే మీ పేరు మీద ఇప్పటివరకు పాన్ కార్డు కలిగి ఉండదు. మీకు ఇప్పటికే పాన్ ఉన్నట్లయితే.. తక్షణ ఇ-పాన్ కోసం దరఖాస్తు చేసుకోకూడదు. ఇక దరఖాస్తు చేసుకునేముందు మీ పేరు, పుట్టిన తేదీ వంటి ఆధార్ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

-అధికారిక ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించండి

-తక్షణ ఇ-పాన్ ఆప్షన్ ఎంచుకోండి

-కొత్త ఇ-పాన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

– మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి

– మీ ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది

-OTPని ఎంటర్ చేయండి

-మీ ఆధార్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటి సమాచారాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయండి.

-అంతా సరిగ్గా ఉంటే ప్రక్రియను పూర్తి చేయండి

-విజయవంతంగా ప్రక్రియ పూర్తి చేశాక acknowledgement number వస్తుంది

-మీ అప్లికేషన్‌ను ట్రాక్ చేయడానికి అక్‌నాలెడ్జ్‌మెంట్ నెంబర్ భద్రపర్చుకోండి

-ఇ-పాన్‌ జనరేట్ అయ్యాక దానిని డౌన్ లోడ్ చేసుకోండి

ఒకవేళ ఆధార్ వివరాలు సరిపోలకపోతే..

ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నా లేదా మొబైల్ నంబర్ ఆధార్‌తో అనుసంధానం చేయకపోయినా లేదా ఇతర అర్హతా అవసరాలు నెరవేరకపోతే ఆన్‌లైన్ ప్రక్రియలో తక్షణ పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అటువంటి సందర్భాలలో ముందుగా మీ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అధీకృత పాన్ సేవా కేంద్రానికి వెళ్లి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Follow Us