నెల రోజులు ఈ ఒక్కటి తినడం మానేస్తే ఏకంగా 3 కిలోల బరువు తగ్గొచ్చు!

11-08-2026

Pic credit - Instagram

Phani Ch

తీపిని మానడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం బరువు తగ్గడం. పంచదారలో అధిక కేలరీలు ఉంటాయి. దానిని ఒక నెల రోజులు పక్కన పెడితే సులభంగా 2 నుండి 3 కిలోల వరకు బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగి మళ్లీ అంతే వేగంగా పడిపోతాయి. దీనివల్ల నీరసం వస్తుంది. పంచదారను మానడం వల్ల రోజంతా శరీరం ఎంతో ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది.

చక్కెర తగ్గించడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గి, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయి.

చక్కెర తినడం వల్ల మన చర్మంలో కొల్లాజెన్ క్షీణించి ముడతలు, మొటిమలు వస్తాయి. ఒక నెల రోజులు షుగర్ మానేస్తే చర్మం కాంతివంతంగా మారి, నిగనిగలాడుతూ మొటిమల సమస్య తగ్గుతుంది.

రాత్రివేళల్లో తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. పంచదారను దూరంగా ఉంచడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి, రాత్రి వేళల్లో హాయిగా గాఢ నిద్ర పడుతుంది.

బాడీలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే కాలేయంలో కొవ్వు చేరుకునే ఫ్యాటీ లివర్ ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.

పంచదార స్థానంలో సహజసిద్ధమైన పండ్లు, ఈత ఖర్జూరం లేదా బెల్లం వంటి వాటిని పరిమితంగా తీసుకోవడం వల్ల తీపి తినాలనే కోరిక కూడా క్రమంగా అదుపులోకి వస్తుంది.