AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్యంత చిన్న వయసులోనే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఐదుగురు.. 2వ పేరు షాకింగ్?

Young Cricket Retirements: గాయాలు, వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఐదుగురు ఆటగాళ్లు తమ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించకుండానే వైదొలగాల్సి వచ్చింది. క్రీడా ప్రపంచంలో ఆరోగ్యంతోపాటు లక్ కూడా కలసి రావాలని అంటుంటారు. వీరికి లక్ ఉన్నా ఆరోగ్యం మాత్రం సహకరించకపోవడంతో తమ ఇష్టమైన క్రీడకు గుడ్ బై చెప్పారు.

అత్యంత చిన్న వయసులోనే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఐదుగురు.. 2వ పేరు షాకింగ్?
Young Cricket Retirements
Venkata Chari
|

Updated on: Aug 11, 2026 | 12:34 PM

Share

Young Cricket Retirements:  సాధారణంగా క్రికెటర్లు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు వచ్చేవరకు కెరీర్‌ను కొనసాగిస్తుంటారు. కొందరు ప్లేయర్లు మాత్రం విధి ఆడిన వింత నాటకంలో తీవ్రమైన గాయాలు, అనారోగ్య సమస్యలు, లీగ్ క్రికెట్ మొగ్గు వల్ల అత్యంత పిన్న వయస్సులోనే అంతర్జాతీయ రంగానికి గుడ్ బై చెప్పి రసజ్ఞులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కంటి గాయం మిగిల్చిన తీవ్ర విషాదం – క్రెగ్ కీస్‌వెట్టర్..

ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ క్రెగ్ కీస్‌వెట్టర్ అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2010 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును విజేతగా నిలిపి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. కంటికి తీవ్రమైన గాయం కావడం వల్ల చూపు మందగించి మ్యాచ్‌లు ఆడటం కష్టంగా మారింది. దీంతో చేసేదేమీ లేక తన 27 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అద్భుతమైన భవిష్యత్తు ఉన్న ఒక మంచి ఆటగాడి కెరీర్ ఇలా అకాలంగా ముగిసిపోవడం అభిమానులను ఎంతగానో కలిచివేసింది.

ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

ఇవి కూడా చదవండి

లీగ్ క్రికెట్ కోసమే వీడ్కోలు – నికోలస్ పూరన్..

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి గాయాలు లేకపోయినప్పటికీ కేవలం 29 ఏళ్ల చిన్న వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వేర్వేరు ఫ్రాంచైజీ లీగ్స్‌లో పూర్తి స్థాయిలో ఆడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సహా పలు టీ20 లీగుల్లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులను అలరిస్తున్నప్పటికీ, వెస్టిండీస్ జాతీయ జట్టుకు దూరమవడం ఆ దేశ క్రికెట్‌కు తీరని లోటని చెప్పవచ్చు.

వెన్నునొప్పి వల్ల 25 ఏళ్లకే ఆటకు గుడ్ బై – జాన్ టర్నర్..

ఇంగ్లాండ్ స్పీడ్ బౌలర్ జాన్ టర్నర్ కథ అత్యంత విషాదకరమైనది. ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరఫున 4 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఈ యంగ్ పేసర్, తీవ్రమైన వెన్నునొప్పి (బ్యాక్ ఇంజ్యూరీ) సమస్యతో బాధపడ్డాడు. ఏడాదికి పైగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన టర్నర్, కేవలం 25 ఏళ్ల లేత వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రాఫెషనల్ క్రికెట్ నుంచి కూడా శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చిన్న వయస్సులోనే కెరీర్‌ను ముగించాల్సిన పరిస్థితి రావడం క్రీడా ప్రేమికులకు తీవ్ర నిరాశ కలిగించింది.

ఎక్కువమంది చదివింది: Video: దమ్ముంటే ఒక్క సిక్స్ కొట్టంటూ రెచ్చగొట్టిన పాక్ దిగ్గజం.. 4 వరుస బంతుల్లోనే నోర్మూయించిన సచిన్..

గాయాలతో వీళ్ల ఫ్యూచర్ క్లోజ్ – సక్లేన్, పుకోవ్స్కీ..

తన మాయాజాల స్పిన్ బౌలింగ్‌తో ప్రపంచ దిగ్గజ బ్యాటర్లను భయపెట్టిన పాకిస్థాన్ గూగ్లీ మాంత్రికుడు సక్లేన్ ముస్తాక్ మోకాళ్ల గాయం వల్ల మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. సర్జరీ తర్వాత ఫామ్ కోల్పోవడంతో 27 ఏళ్లకే అంతర్జాతీయ ఆటకు స్వస్తి పలికాడు. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన విల్ పుకోవ్స్కీ భారత్‌పై టెస్టు అరంగేట్రం చేసినప్పటికీ, తలకు పదే పదే బంతి తగలడం (కన్కషన్) వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ప్రాణభయంతో పాటు ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని 27 ఏళ్ల ప్రాయంలోనే ఆట నుంచి తప్పుకొని నిష్క్రమించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us