AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: దమ్ముంటే ఒక్క సిక్స్ కొట్టంటూ రెచ్చగొట్టిన పాక్ దిగ్గజం.. 4 వరుస బంతుల్లోనే నోర్మూయించిన సచిన్..

Sachin vs Abdul Qadir 28 Runs in an Over: ఒక్క మ్యాచ్‌తోనే కాదు, తన సుదీర్ఘ కెరీర్‌లో ప్రత్యర్థుల సవాళ్లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పడం సచిన్‌కు అలవాటు. అబ్దుల్ ఖాదిర్ సవాల్‌కు సచిన్ ఇచ్చిన ఆ సమాధానం క్రికెట్ చరిత్ర పుటల్లో ఒక అమూల్యమైన ఘట్టంగా ఎప్పటికీ నిలిచిపోతుంది.

Video: దమ్ముంటే ఒక్క సిక్స్ కొట్టంటూ రెచ్చగొట్టిన పాక్ దిగ్గజం.. 4 వరుస బంతుల్లోనే నోర్మూయించిన సచిన్..
Sachin Vs Abdul Qadir 28 Runs In An Over Video
Venkata Chari
|

Updated on: Aug 10, 2026 | 10:24 AM

Share

Sachin vs Abdul Qadir 28 Runs in an Over: పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్‌ను మైదానంలో బహిరంగంగా రెచ్చగొట్టాడు. నోటితో ఒక్క మాట మాట్లాడకుండా కేవలం బ్యాట్‌తోనే సచిన్ సమాధానమిచ్చాడు. ఒకే ఓవర్లో ఏకంగా 28 పరుగులు పిండుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ చారిత్రాత్మక ఘట్టం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయింది.

1989వ సంవత్సరంలో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో కేవలం 16 ఏళ్ల పసికూనగా మైదానంలోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ పట్ల పాక్ బౌలర్లు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. అనుభవం లేని కుర్రాడని భావించి మాటలతో సవాల్ విసిరే ప్రయత్నం చేశారు. ఒక ప్రదర్శన మ్యాచ్‌లో సచిన్ క్రీజులోకి వచ్చినప్పుడు పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ బౌలింగ్ చేస్తున్నాడు. అప్పటికే తన అద్భుతమైన షాట్లతో ముస్తాక్ బౌలింగ్‌ను సచిన్ చీల్చి చెండాడాడు సచిన్.

ముస్తాక్ అహ్మద్‌పై మూడో బంతికి సిక్సర్ల వర్షం..

కేవలం మూడు బంతుల్లోనే 16 పరుగులు రాబట్టి సచిన్ తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ముస్తాక్ అహ్మద్‌ను ఒక పసిపిల్లవాడు దంచికొట్టడం చూసి పాకిస్తాన్ దిగ్గజ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ తట్టుకోలేకపోయాడు. నేరుగా సచిన్ వద్దకు వచ్చి మానసికంగా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాడు.

ఇవి కూడా చదవండి

“నన్ను కొట్టు చూద్దాం!”.. ఖాదిర్ సవాల్..

“చిన్నోడా, ఆ కుర్రాడి బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం పెద్ద విషయమేమీ కాదు. ధైర్యముంటే నా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి చూడు. వెంటనే స్టార్ అయిపోతావ్” అంటూ సచిన్‌కు బహిరంగంగా సవాల్ విసిరాడు. మైదానంలో ప్రత్యర్థి క్రీడాకారులు ఎంత రెచ్చగొట్టినా సచిన్ ఏమాత్రం చలించలేదు. నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రానివ్వలేదు. శాంతంగా బ్యాట్ పట్టుకుని తర్వాతి ఓవర్ కోసం సిద్ధమయ్యాడు.

ఒకే ఓవర్లో 28 పరుగులు.. ఖాదిర్ నోట మాట రాలేదు!

అబ్దుల్ ఖాదిర్ తర్వాతి ఓవర్ వేసేందుకు బంతిని చేతిలోకి తీసుకున్నాడు. తొలి బంతిని సచిన్ నెమ్మదిగా గమనించి, రెండో బంతి నుంచి తన అసలైన విధ్వంసాన్ని ప్రారంభించాడు. మైదానం నలుమూలలా బంతిని సిక్సర్లుగా మలుస్తూ ఖాదిర్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. మొదటి సిక్సర్ స్టేడియంలో పడగా, తర్వాతి బంతికి మరో భారీ సిక్స్ బాదాడు. మూడో బంతికి కూడా మైదానం దాటేలా మూడో సిక్సర్ విసిరాడు. అక్కడితో ఆగకుండా ఐదో బంతికి మరో సిక్స్, ఆరో బంతికి కళ్లు చెదిరే ఫోర్ కొట్టాడు.

ఆ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 28 పరుగులు పిండుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో వేలాది వికెట్లు తీసిన ఒక దిగ్గజ స్పిన్నర్ తన సొంత మైదానంలోనే 16 ఏళ్ల కుర్రాడి చేతిలో దారుణంగా ఊచకోతకు గురికావడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆ మ్యాచ్ పూర్తయిన తర్వాత అబ్దుల్ ఖాదిర్ స్వయంగా సచిన్ వద్దకు వచ్చి ప్రశంసల వర్షం కురిపించాడు. “ఈ రోజు నేను ఒక భవిష్యత్తు దిగ్గజాన్ని చూశాను. ఈ చిన్నోడు ఏదో ఒక రోజు ప్రపంచ క్రికెట్‌ను ఏలుతాడు” అని వ్యాఖ్యానించాడు. ఆ రోజు నుంచి సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలో “గాడ్ ఆఫ్ క్రికెట్”గా మారే ప్రయాణం వేగవంతమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us