అందంతో కుర్రాళ్లను ఆగం చేస్తున్న ముద్దుగుమ్మ తేజస్వి 

18 June 2026

Pic credit - Instagram

Rajeev 

2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైంది తేజస్వి మదివాడ. 

ఆ సినిమాలో ఆమె కనిపించింది కొంచంసేపు మాత్రమే అయినా తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 

ఆతర్వాత హీరోయిన్ గా మారింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది.

అదే క్రేజ్ తో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా మరికొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు.

తేజస్వి 2024లో రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ షోలో పాల్గొన్నది. అలాగే మరికొన్ని టీవీ షోల్లోనూ పాల్గొంది ఈ అందాల చిన్నది.

సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా చేసింది. అదేవిధంగా కొన్ని యాడ్స్ లోనూ నటించింది. 

మొదటగా అల్లు అర్జున్ తో కలిసి సెవన్ అప్‌ ప్రకటనకు పనిచేసింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది తేజస్వి మదివాడ.