తూర్పు గోదావరి జిల్లాను భారీ గాలివాన అతలాకుతలం చేసింది. గోకవరం, కోరుకొండ, రాజానగరం, రంపచోడవరం ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వల్ల రోడ్లు జలమయమయ్యాయి. మధురపూడిలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో మంటలు చెలరేగాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది.