సూర్య 50వ సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ బజ్
కోలీవుడ్ స్టార్ సూర్య తన 50వ సినిమా కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మైల్ స్టోన్ మూవీని కామెడీ జానర్‌లో చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి, నెల్సన్ పేర్లు దర్శకుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్‌లో 50వ మైల్ స్టోన్ సినిమా కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సూర్య, తన యాభైవ చిత్రం విషయంలో ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా జానర్ విషయంలో ఆయన ఓ క్లారిటీకి వచ్చినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సూర్య 50వ సినిమాను కామెడీ జానర్‌లోనే తెరకెక్కించాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుల విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు కోలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ నెల్సన్ పేరు తెరపైకి వచ్చింది. నెల్సన్ దర్శకత్వంలో సూర్య తన 50వ సినిమాను చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సూర్య ప్రస్తుతం ఉన్న మంచి ఫామ్‌ను కొనసాగించాలంటే నెల్సన్ సరైన ఎంపిక అని ఆయన భావిస్తున్నారట. ఈ మైల్ స్టోన్ ప్రాజెక్ట్‌కు ఏ దర్శకుడికి అవకాశం దక్కుతుందో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం :
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
మాయమైపోతున్న మాన్‌సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం
జాహ్నవి తిరిగొస్తుందా? జ్ఞాని తిమ్మప్ప సంచలన వ్యాఖ్యలు
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!
లక్ష ఇస్తే.. 2 లక్షలు చేస్తాం.. మాయా లేదు మంత్రం లేదు!
ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!
బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

