కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ననియాల, ఎస్ గొల్లపల్లి ప్రాంతాల్లోని మామిడి తోటలపై రాత్రివేళల్లో దాడులు చేస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రాణనష్టం భయంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యపై అటవీశాఖ వెంటనే స్పందించి ఏనుగులను అడవిలోకి తరిమివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.