AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi Rudrani: టాలీవుడ్‌కు మరో హీరో దొరికేశాడు.. బ్రహ్మముడి రుద్రాణి కొడుకును చూశారా? ఫొటోస్ వైరల్

ప్రస్తుతం బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్‏లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ఇందులో పవర్ ఫుల్ విలన్ రుద్రాణి పాత్రలో అదరగొట్టేసింది షర్మిత గౌడ. అయితే ఈ సీరియల్ లో ఆమె పాత్ర న ముగియడంతో ఇప్పుడు కుటుంబంతో ఎంజాయ్ చేస్తోందీ అందాల తార.

Brahmamudi Rudrani: టాలీవుడ్‌కు మరో హీరో దొరికేశాడు.. బ్రహ్మముడి రుద్రాణి కొడుకును చూశారా? ఫొటోస్ వైరల్
Brahmamudi Serial Actress Rudrani
Basha Shek
|

Updated on: Jun 18, 2026 | 9:27 PM

Share

బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోన్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సీరియల్ ను క్రమం తప్పకుండా చూస్తున్నారు. అందుకే ఏళ్లు గడుస్తున్నా బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. ఈ సీరియల్‌లో నటించిన ఆర్టిస్టులు కూడా బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. రాజ్, కావ్యలుగా నటించిన మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు ఇప్పుడు బుల్లితెరపై స్టార్స్ గా వెలుగొందుతున్నారు. వీరిద్దరితో పాటు ఇదే సీరియల్ లో పవర్ ఫుల్ విలన్ గా నటించింది షర్మిత గౌడ. రుద్రాణి పాత్రలో అద్భత అభినయం ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. కర్ణాటకకు చెందిన షర్మిత మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2017లో మిస్ కర్ణాటక టైటిల్ కిరీటం కూడా గెల్చుకుంది. ఆ తర్వాత కన్నడ, తమిళ సీరియల్స్ లో నటించింది. ఇక బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది షర్మిత. హీరోయిన్లను మించిన అందంతో కనిపించే ఆమె ఈ సీరియల్ లో తన విలనిజంతో ఆడియెన్స్ కు బాగా కోపం తెప్పించింది. అయితే ఇప్పుడీ సీరియల్ లో రుద్రాణి పాత్ర ముగిసింది. దీంతో ఆమె తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది.

తాజాగా తన కుమారుడితో ఉన్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది షర్మిత. దీంతో ఒక్కసారిగా ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు షర్మితకు అంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్న సమాచారం ప్రకారం షర్మిత కుమారుడి పేరు స్కంధ అని తెలుస్తోంది. అయితే అతనికి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఇంకా ఉన్నత చదువులు అభ్యసిస్తున్నాడని సమాచారం. అంతేకాదు చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ ప్లేయర్ అవ్వాలని కలలు కంటోన్న స్కంధ అందుకు తగ్గ శిక్షణను కూడా తీసుకుంటున్నాడట.

ఇవి కూడా చదవండి

కుమారుడితో రుద్రాణి..

స్కంధ అభిరుచి గురించి తెలుసుకున్న షర్మిత కూడా తన కుమారుడిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోందట. అతని కెరీర్ ఎదుగుదలకు అవసరమైన తోడ్పాటు అందిస్తోందట. కాగా ఇటీవలే పుట్టిన రోజు జరుపుకొన్న స్కంధకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపింది షర్మిత. తన కుమారుడితో కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘ నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు గొప్ప వ్యక్తిగా ఎదగడం చూడడం నా జీవితంలో లభించిన గొప్ప వరాల్లో ఒకటి. ఎప్పుడూ నవ్వుతూ, కలలు కంటూ నీలాగే ఉండు’ అంటూ షర్మిత గౌడ రాసుకొచ్చింది. ప్రస్తుతం స్కంధతో ఉన్న షర్మిత గౌడ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us