తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్న అందాల భామ అవికా గోర్

19 June 2026

Pic credit - Instagram

Rajeev 

సీరియల్స్ ద్వారా క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ అవికా గోర్. ఈ అమ్మడికి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అవిక

అవికా గోర్‌ 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే విజయం సాధించింది. 

ఆ తర్వాత వరుసగా సినిమా ఛాన్స్ లు అందుకుంటూ హీరోయిన్ గా రాణించింది. అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది ఈ అందాల తార.

'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజు గారి గది 3' వంటి సినిమాలలో తన నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అవికా గోర్ 2025 లో  వ్యాపారవేత్త. 'క్యాంప్ డైరీస్' ఎన్జీవోను వ్యవస్థాపకుడు మిళింద్ చద్వానీని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమా చేస్తుంది.

ఇటీవలే తెలుగులో సినిమా చేసింది అవికా,  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.