AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్.. 22 రకాల వస్తువులతో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్!

తెలంగాణలో విద్యా, క్రీడా రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.

విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్.. 22 రకాల వస్తువులతో యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్!
Cm Revanth Reddy Young India Student Kits
Balaraju Goud
|

Updated on: Jun 19, 2026 | 6:06 PM

Share

తెలంగాణలో విద్యా, క్రీడా రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు.

Young India Student Kits Distribution

Young India Student Kits Distribution

ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు చెందిన సుమారు 15 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు చదువుకునే సంస్థల స్వభావాన్ని బట్టి వారి అవసరాలకు అనుగుణంగా కిట్లను రూపొందించారు. గురుకుల విద్యార్థులకు 22 రకాల వస్తువులు, హాస్టల్ విద్యార్థులకు 10 రకాల వస్తువులు, డే స్కాలర్లకు 7 రకాల విద్యా సామగ్రిని అందించనున్నారు.

అదే వేదికపై రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన రూ.50.73 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు గవర్నర్ ఎస్.పీ. శుక్లాతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.36.65 కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, స్టేడియాల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. షాద్‌నగర్‌లో రూ.10 కోట్లతో మినీ స్టేడియం, సంగారెడ్డిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణ, నారాయణపేట, వనపర్తి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు క్రీడా మౌలిక వసతుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.అలాగే రూ.14.08 కోట్ల వ్యయంతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాల్లో బాలబాలికల కోసం ప్రత్యేక క్రీడా అకాడమీలను ప్రారంభించారు. ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్ తెలంగాణ టాలెంట్ అకాడమీ, అథ్లెటిక్స్ అకాడమీ, హాకీ అకాడమీ, ఫుట్‌బాల్ అకాడమీ, హ్యాండ్‌బాల్ అకాడమీలు అందుబాటులోకి వచ్చాయి.

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పించడమే కాకుండా, గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, క్రీడలు రెండింటినీ సమానంగా ప్రోత్సహిస్తూ తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ముఖ్యమంత్రి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇండియాలో ఇంగ్లీష్ సినిమాల ట్రెండింగ్
ఇండియాలో ఇంగ్లీష్ సినిమాల ట్రెండింగ్
రీ రిలీజ్ హంగామా.. సోలో డేట్‌ను లాక్ చేసిన పాత సినిమాలు
రీ రిలీజ్ హంగామా.. సోలో డేట్‌ను లాక్ చేసిన పాత సినిమాలు
టాలీవుడ్ హీరోల కోసం ప్రపంచాన్నే సెట్స్‌గా మార్చేస్తున్న దర్శకులు!
టాలీవుడ్ హీరోల కోసం ప్రపంచాన్నే సెట్స్‌గా మార్చేస్తున్న దర్శకులు!
వాట్ ఏ టైటిల్.. వాళ్ల రూట్‌లో అనిల్ రావిపూడి..!
వాట్ ఏ టైటిల్.. వాళ్ల రూట్‌లో అనిల్ రావిపూడి..!
'హరా హచి బు' అంటే తెలుసా.. బరువు తగ్గడానికి జపనీస్ సీక్రెట్..
'హరా హచి బు' అంటే తెలుసా.. బరువు తగ్గడానికి జపనీస్ సీక్రెట్..
కొబ్బరి పాల సువాసనతో అదిరిపోయే పుట్టగొడుగుల బిర్యానీ తయారీ విధానం
కొబ్బరి పాల సువాసనతో అదిరిపోయే పుట్టగొడుగుల బిర్యానీ తయారీ విధానం
బిగ్గెస్ట్ కలెక్షన్లకు డబుల్ బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు..
బిగ్గెస్ట్ కలెక్షన్లకు డబుల్ బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు..
బయట కొనే పని లేకుండా లంచ్ బాక్స్ స్పెషల్ చికెన్ రైస్..
బయట కొనే పని లేకుండా లంచ్ బాక్స్ స్పెషల్ చికెన్ రైస్..
మధ్యాహ్నం ఒంటిగంట అయిందని ఆకలి లేకపోయినా భోజనం చేస్తున్నారా..
మధ్యాహ్నం ఒంటిగంట అయిందని ఆకలి లేకపోయినా భోజనం చేస్తున్నారా..
"ఓం నమః శివాయ" మంత్రాన్ని శివభక్తులు అంతగా ఎందుకు జపిస్తారు?