AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadde Naveen: ఉదయాన్నే అది తినాల్సిందే.. డైట్ సీక్రెట్ చెప్పిన వడ్డే నవీన్.. 50 ప్లస్‌లో షాకింగ్ లైఫ్‌స్టైల్

ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్, హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (జూన్ 19) ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vadde Naveen: ఉదయాన్నే అది తినాల్సిందే.. డైట్ సీక్రెట్ చెప్పిన వడ్డే నవీన్.. 50 ప్లస్‌లో షాకింగ్ లైఫ్‌స్టైల్
Actor Vadde Naveen
Basha Shek
|

Updated on: Jun 18, 2026 | 6:12 PM

Share

సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు హీరో వడ్డే నవీన్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు. కొత్త దర్శకుడు కమల్ తేజ నార్ల తెరకెక్కించిన ఈ సినిమాలో నవీన్ సరసన రాశీసింగ్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ మూవీపై పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు హీరో నవీన్ కూడా విస్తృతంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారీ సీనియర్ హీరో. ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన వడ్డే నవీన్ తన డైలీ రోటీన్ లైఫ్, ఆహార అలవాట్ల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. అదేంటంటే ఈ హీరో బ్రేక్ ఫాస్ట్ లోనే చికెన్ తీసుకుంటారట.

‘ప్రతి రోజు ఉదయాన్నే ఒక గంట వాకింగ్, జిమ్ చేస్తాను. ఉదయాన్నే టిఫిన్ కాకుండా డైరెక్ట్‌గా మీల్స్ తీసుకుంటాను. ఉదయమే చికెన్‌, రైస్ తింటాను. లేదంటే వెజ్‌ కర్రీ ఏదైనా సరే రైస్‌తో కలిపి తీసుకుంటాను. అయితే ఇక మధ్యాహ్నం లంచ్‌ చేయను. నైట్ డిన్నర్‌లో కూడా ఉదయం లాగే నాన్‌వెజ్‌తో పాటు వెజ్‌ కూడా తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు వడ్డే నవీన్. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఉదయాన్నే చికెన్ తీసుకోవం, అలాగే లంచ్ చేయకపోవడం అన్నది కాస్త వింతగానే అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’ సినిమా ప్రమోషన్లలో వడ్డే నవీన్..

View this post on Instagram

A post shared by NANDU (@cinemastars77)

‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు’ సినిమా విషయానికి వస్తే.. ఇప్పటిదాకా రిలీజైన కంటెంట్ బట్టి చూస్తే ఇదొక పక్కా పొలిటికల్, క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. వడ్డే క్రియేషన్స్‌ బ్యానర్ పై వడ్డే నవీన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. కల్యాణ్ మాలిక్ స్వరాలు అందించారు. దేవీ ప్రసాద్, బాబా మాస్టర్, రఘు బాబు, సూర్రయ, గాయత్రి భార్గవి తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us