AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. 4, 8, 9 అంకెల వెనుక ఉన్న షాకింగ్ నిజాలివే..!

Fruit Sticker Plu Code Details: ఆరోగ్యం కోసం తినే పండ్లే వ్యాధులకు కారణం కాకూడదంటే వినియోగదారులుగా మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. స్టిక్కర్ కోడ్లపై కనీస అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యాపారుల చేతిలో మోసపోకుండా మన కష్టార్జితాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.

ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. 4, 8, 9 అంకెల వెనుక ఉన్న షాకింగ్ నిజాలివే..!
Fruit Sticker Plu Code
Venkata Chari
|

Updated on: Aug 03, 2026 | 7:09 AM

Share

సగం సగం సమాచారంతో మనం పండ్లను కొనుగోలు చేస్తూ మోసపోతున్నాం. విదేశాల నుంచి వచ్చాయని ఆపిల్స్ మీద ఉండే మెరిసే స్టిక్కర్లను చూసి మురిసిపోతున్నారా? వాటికి ఎక్కువ రేటు చెల్లించి కొనేస్తున్నారా? అయితే మీరు తక్షణమే తెలుసుకోవాల్సిన ఒక షాకింగ్ నిజం వాటి వెనుక దాగి ఉంది. ఆ చిన్న స్టిక్కర్లు పండ్ల నాణ్యతను కాక, వాటిని ఎలా పండించారో చెప్పే ప్రమాదకర సంకేతాలు అని తెలుసా..?

స్టిక్కర్ ఉంది కదా అని మోసపోకండి..!

ఈ రోజుల్లో సూపర్ మార్కెట్ దగ్గర నుంచి వీధి చివర తోపుడు బండి వరకు ప్రతీ చోట స్టిక్కర్లు ఉన్న పండ్లే దర్శనమిస్తున్నాయి. మనలో చాలామంది ఆ స్టిక్కర్ ఉంటే చాలు, అది దిగుమతి చేసుకున్న హైక్వాలిటీ పండు అని కళ్లు మూసుకుని నమ్మేస్తుంటారు. కొందరు వ్యాపారులు ఇదే బలహీనతను ఆసరాగా చేసుకుని సాధారణ పండ్లకు కూడా ఇలాంటి స్టిక్కర్లు వేసి భారీగా దండుకుంటున్నారు. నిజానికి ఆ స్టిక్కర్లపై ఉండే కోడ్లను ‘పీఎల్ యూ’ అంటారు. పండు రకం, పండించిన విధానం తెలియజేయడానికే వీటిని వాడతారు తప్ప ధరతో లేదా నాణ్యతతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు.

డిజిట్ 4 తో మొదలైతే ప్రమాదమా..?

పండ్ల మీద నాలుగు అంకెల కోడ్ ఉండి, అది 4 సంఖ్యతో ప్రారంభమవుతుందా? ఉదాహరణకు 4026 లేదా 4987 లాంటి నంబర్లు ఉంటే గనుక జాగ్రత్తపడండి. ఈ రకం పండ్లను పండించడానికి రసాయన ఎరువులు, ప్రమాదకరమైన పురుగుమందులను విచ్చలవిడిగా వాడారని అర్థం. మనం రోజూ మార్కెట్లో చూసే మెజారిటీ పండ్లు ఈ కేటగిరీకి చెందినవే. పైకి ఎంతో నిగనిగలాడుతూ కనిపించే ఈ పండ్లలో రసాయనాల అవశేషాలు ఉండే అవకాశం చాలా ఎక్కువ. అందుకే వీటిని నేరుగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

8 సంఖ్య వెనుక దాగున్న జెనెటిక్ నిజాలు..

కొన్ని పండ్లపై ఐదు అంకెల కోడ్ ఉండి, అది 8 అంకెతో మొదలవుతుంది. ఇలా 84026 వంటి నంబర్లు కనిపిస్తే అవి జెనెటికల్లీ మోడిఫైడ్ లేదా జన్యు మార్పిడి చేసిన పంటలని సూచించడానికి వాడేవారు. అయితే ఇప్పుడు మన మార్కెట్లలో ఇటువంటి కోడ్లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ 9 సంఖ్యతో ప్రారంభమయ్యే ఐదు అంకెల కోడ్ ఉంటే మాత్రం అది ప్యూర్ ఆర్గానిక్ పండు అని గుర్తించాలి. ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన పండ్లకే ఈ రకమైన కోడ్ ఇస్తారు.

కొనే ముందు ఇవి కచ్చితంగా పాటించండి..

కేవలం స్టిక్కర్ మెరుపులు చూసి మోసపోవడం ఇకనైనా ఆపాలి. షాపింగ్ చేసేటప్పుడు ప్రతీ పండు మీద ఉన్న ఆ నంబర్ల అర్థాన్ని తెలుసుకుని సరైన వాటిని ఎంచుకోవడం అలవాటు చేసుకోండి. పండ్లు ఏవైనా సరే ఇంటికి తెచ్చిన తర్వాత ఉప్పు, పసుపు వేసిన స్వచ్ఛమైన నీటిలో కాసేపు నానబెట్టి శుభ్రంగా కడగాలి. వీలైతే పండ్ల తోలు తీసి తినడమే ఆరోగ్యపరంగా సురక్షితమైన మార్గం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే..
ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే..
టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్ క్రికెటర్లు..!
టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్ క్రికెటర్లు..!
ఆపిల్, అరటిపండు తినేముందు ఈ వాస్తవాలు తెలుసుకోండి..
ఆపిల్, అరటిపండు తినేముందు ఈ వాస్తవాలు తెలుసుకోండి..
శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి?దీని వెనక కథ ఇదే
శ్రావణ మాసంలో పాములు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి?దీని వెనక కథ ఇదే
అందమైన చెలికత్తే.. అప్పట్లో లవర్ బాయ్.. ఫాలోయింగ్ చూస్తే..
అందమైన చెలికత్తే.. అప్పట్లో లవర్ బాయ్.. ఫాలోయింగ్ చూస్తే..
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యం చెప్పే 5 రాశులు ఇవే..
దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యం చెప్పే 5 రాశులు ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా? తాజా రేట్లు
ఈ రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయా? తగ్గాయా? తాజా రేట్లు
ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు..
ఉదయాన్నేఇది సబ్జా సీడ్స్ ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు..
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం