AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Charges: ఏటీఎం వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలు పెంపు.. బాదుడే.. బాదుడు..

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఏటీఎం రూల్స్ రాబోతున్నాయి. డెబిట్ కార్డులు వినియోగించేవారిపై మరింత భారం మోపేందుకు బ్యాంక్‌లు సిద్దమయ్యాయి. ఏటీఎం ఛార్జీలను మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఛార్జీలను పూర్తిగా మార్చాయి. కొత్త ఛార్జీ వివరాలు ఇలా..

ATM Charges: ఏటీఎం వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి ఛార్జీలు పెంపు.. బాదుడే.. బాదుడు..
UPI ATM
Venkatrao Lella
|

Updated on: Mar 21, 2026 | 1:22 PM

Share

ఏటీఎం వినియోగదారులకు షాకింగ్ న్యూస్. దేశంలో ఏటీఎం సర్వీస్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలను విధించేందుకు బ్యాంకులు సిద్దమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించాయి. ఉచిత ఏటీఎం లావాదేవీల తర్వాత చేసే ట్రాన్సాక్షన్లకు ఛార్జీలను భారీగా పెంచాయి. పెంచిన ఛార్జీలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆ రోజు నుంచి మీరు ఆర్ధిక విషయాల్లో అనేక మార్పులను చూడవచ్చు. ఏటీఎం నగదు ఉపసంహరణకు ఛార్జీల విధానాలను పూర్తిగా మార్చాయి.

కొత్త నిబంధనలు

-దేశంలో నెంబర్ వన్ ప్రైవేట్ బ్యాంక్‌గా పేరు పొందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ ఆధారిత ఏటీఎం విత్ డ్రాలను నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల జాబితాలో చేర్చింది. దీంతో వినియోగదారులకు ఇది పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. ఇక ఉచిత ట్రాన్సాక్షన్ల తర్వాత విధించే చార్జిని పెంచింది. ఇక నుంచి ప్రతీ లావాదేవీకి రూ.23 వసూలు చేయనుంది.

-పంజాబ్ నేషనల్ బ్యాంక్ రోజువారీ విత్ డ్రా పరిమితిని తమ ఏటీఎం కార్డులపై తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో రోజు రూ.లక్ష డెబిట్ కార్డుల నుంచి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఇప్పుడు రూ.50 వేలకు సవరించింది. మాస్టర్ ప్లాటినం, వీసా గోల్డ్, ప్లాటినం రైజ్, రూపే బిజినెస్ ప్లాటినం ఎన్‌సీఎంసీ, RuPay PNB పలాష్ డెబిట్ కార్డ్- రీసైకిల్డ్ PVC, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, రూపే ఎణ్‌సీఎంసీ ప్లాటినం ఇంటర్నేషనల్, ప్లాటినం డొమెస్టిక్, మాస్టర్ కార్డ్ ప్లాటినం రైజ్ డెబిట్ కార్డులపై విత్ డ్రా పరిమితిని తగ్గించింది.

-ఇక వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్, రూపే సెలక్ట్, రూపే సెలక్ట్ నియో, రూపే సెలక్ట్ ఎక్సెల్ ఏటీఎం కార్డులప రూ.1.50 లక్షల నుంచి రూ.75 వేలకు తగ్గించింది.

-అలాగే బంధన్ బ్యాంక్ ఉచిత లావాదేవీల తర్వాత చేసే ఏటీఎం ట్రాన్సక్షన్ల ఛార్జీల్లో మార్పులు చేసింది. ఇక నుంచి ప్రతీ లావాదేవీకి రూ.23 విధించనుంది. ఇక ఆర్ధికేతర లావాదేవీలకు రూ.10 ఛార్జ్ చేయనుండగా.. ఏటీఎం లావాదేవీ తిరస్కరణకు గురైతే రూ.25 విధించనుంది

-అయితే మెట్రో నగరాల్లో ఒకలా.. నాన్ మెట్రో నగరాల్లో ఒకలా పరిమితులు ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా, ముబై, ఢిల్లీ మెట్రో నగరాలుగా ఉన్నాయి.

Follow Us