AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్పత్రే అవసరం ఉండదు.. వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..

రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అయితే ఈ వర్షాకాలం కేవలం ఉపశమనాన్నే కాదు.. తనతో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులను కూడా మోసుకొస్తుంది. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా విజృంభిస్తాయి. ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ జ్వరాలు సర్వసాధారణంగా మారుతుంటాయి. ఇలాంటి సమయంలో మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం తులసి. వర్షాకాలంలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా తులసి ఆకులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం.

Krishna S
|

Updated on: Jun 19, 2026 | 7:51 PM

Share
రోగనిరోధక శక్తికి పవర్‌హౌస్: భారతీయ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందో.. అంతకు మించిన అద్భుతమైన ఔషధ గుణాలు అందులో దాగి ఉన్నాయి. తులసి ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో పవర్‌హౌస్‌లా పనిచేస్తాయి. వర్షాకాలంలో రోజూ ఉదయాన్నే పరగడుపున నాలుగు తులసి ఆకులను నమలడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి, బయటి నుండి దాడి చేసే ఎలాంటి వైరస్‌లనైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.

1 / 5
శ్వాసకోశ సమస్యలకు పక్కా చెక్: వర్షంలో తడవడం వల్ల లేదా చల్లటి గాలుల కారణంగా ఈ సీజన్‌లో చాలా మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు ఇన్‌ఫెక్షన్, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి ఈ కాలం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అయితే తులసి ఆకులలో ఉండే కాంపోనెంట్స్ ఊపిరితిత్తులలోని కఫాన్ని కరిగించడంలో అద్భుతంగా సహాయపడతాయి. తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా తాడగడం వల్ల గొంతు నొప్పి క్షణాల్లో మాయమవ్వడమే కాకుండా శ్వాస వ్యవస్థ క్లియర్ అవుతుంది.

2 / 5
జీర్ణక్రియ - బాడీ డిటాక్స్: వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన జీర్ణవ్యవస్థ కాస్త మందగిస్తుంది. పైగా ఈ సీజన్‌లో రోడ్డు పక్కన దొరికే జంక్ ఫుడ్ లేదా కలుషిత నీటిని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, విరేచనాలు వంటి జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ సమస్యకు కూడా తులసి చక్కటి పరిష్కారం చూపుతుంది. తులసి ఆకులు శరీరంలోని జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, తిన్న ఆహారం త్వరగా అరిగేలా చేస్తాయి. అంతేకాకుండా ఇది ఒక అద్భుతమైన నేచురల్ డిటాక్సిఫైయర్ కావడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్  బయటకు పంపి లివర్, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

3 / 5
వైరల్ జ్వరాలు: రుతుపవనాల సమయంలో దోమల వ్యాప్తి విపరీతంగా పెరగడం వల్ల మలేరియా, డెంగ్యూ, సాధారణ టైఫాయిడ్, వైరల్ జ్వరాలు వేగంగా వ్యాపిస్తాయి. తులసి ఆకులలో ఉండే జెర్మిసైడల్, ఫంగిసైడల్ గుణాలు శరీరంలోని జ్వర తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. జ్వరం వచ్చినప్పుడు తులసి ఆకుల రసంలో కొద్దిగా తేనె లేదా మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుంది. అందుకే ఆయుర్వేదంలో దీనిని జ్వర నివారిణిగా కూడా పిలుస్తారు.

4 / 5
ఒత్తిడి నివారణ: కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా తులసి ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకులలో అడాప్టోజెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోని ఒత్తిడి స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. వర్షాకాలంలో వచ్చే బద్ధకాన్ని వదిలించి, మైండ్‌ను రిఫ్రెష్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రోజూ ఉదయాన్నే తులసి ఆకులు వేసిన బ్లాక్ టీ లేదా నార్మల్ టీ తాగడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది, రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండేలా మూడ్ బూస్ట్ అవుతుంది. (గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని టీవీ9 నిర్ధారించడం లేదు. ఆహార మార్పులు చేసుకునే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి

ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !

అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ

బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..

51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే