AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఊరి చివర చెరువు ఏదో కదులుతూ కనిపించింది.. భయం.. భయంగా దగ్గరకు వెళ్లి చూడగా

గుంటూరు జిల్లా ఈదులపాలెంలో చెరువులో దొరికిన మృతదేహం మిస్టరీ వీడింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. తాగుబోతు భర్త వెంకటేశ్వరరావు వేధింపులు భరించలేక అతని భార్య, ఆమె బంధువులే అతన్ని కొట్టి చంపారని.. అనంతరం మృతదేహాన్ని రాయి కట్టి చెరువులో పడేశారని తెలిపారు. విచారణలో భార్య వాస్తవాలు వెల్లడించడంతో ఆమెతో పాటు నిందితులను అరెస్ట్ చేశాసినట్టు పోలీసులు తెలిపారు. నింది తులపపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

Andhra News: ఊరి చివర చెరువు ఏదో కదులుతూ కనిపించింది.. భయం.. భయంగా దగ్గరకు వెళ్లి చూడగా
Guntur Murder
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 1:19 PM

Share

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం తెల్లవారుజామునే ఈదుల పాలెం చెరువులో పురుషుడి మృతదేహం కనిపించింది. స్థానికులు శవాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గుంటూరులోని మార్చురీకి తరలించారు. అయితే మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేసినట్లు, మృతుడి వంటిపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హత్య చేసి శవం తేలకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాయి కట్టి చెరువులో పడేసినట్లు భావించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పొన్నూరు పట్టణానికి చెందిన తన్నీరు వెంకటేశ్వరావుకు గుంటూరు సమీపంలోని దాసరి పాలెంకు చెందిన తిరుపతమ్మతో వివాహం అయింది. ఆరేళ్ల కిందట వివాహమైన వీరికి ఒక పాప ఉంది. అయితే కొద్దీ కాలంగా మద్యానికి బానిసైన వెంకటేశ్వరావు భార్యాపిల్లలను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో వేధింపులు తట్టుకోలేని భార్య తన పుట్టింటికి వెల్లిపోయింది. దీంతో పంచాయతీ పెట్టి ఇరు వర్గాలు సర్ధిచెప్పడంతో అమె మరోసారి భర్త వద్దకు వెళ్లింది. అయినా భర్త తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.. మళ్లీ భాను వేధించడం స్టార్ట్ చేశాడు.

ఇక భర్త పెట్టే బాధలు తట్టుకోలేక ఆమె తన బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో గ్రామం నుండి వెంకటేశ్వరావు ఇంటికి వెళ్లిన బంధువులు అతన్ని ప్రశ్నించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరావుతో మాటామాట పెరిగింది. అతనిపై దాడి చేశారు. దాడి చేస్తున్న సమయంలోనే వెంకటేశ్వరావు కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత చనిపోయాడు. వెంకటేశ్వరావు చనిపోయిన విషయాన్ని గుర్తించిన తిరుపతమ్మ అతని బంధువులు విషయం బయటపడుతుందన్న భయంతో వెంటనే అతన్ని మృతదేహాన్ని ఈదులపాలెం వద్దకు తీసుకొచ్చి రాయి కట్టి చెరువులో పడేశారు.

ఇక వేకటేశ్వరరావు కనిపించక పోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుని పరిగణలోకి తీసుకన్న పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో భాగంగా మృతుడి భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంలో అన్ని విషయాలు చెప్పింది. దీంతో దాడి చేసిన వారితో పాటు భార్యను అదుపులోకి తీసుకొన్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వెంకటేశ్వరావును హత్య చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఊరి చివర చెరువు ఏదో కదులుతూ కనిపించింది.. భయం.. భయంగా
ఊరి చివర చెరువు ఏదో కదులుతూ కనిపించింది.. భయం.. భయంగా
మానసిక ఒత్తిడికి చెక్ పెట్టే అద్భుత మూలిక జటామాంసి..అందం,ఆరోగ్యం
మానసిక ఒత్తిడికి చెక్ పెట్టే అద్భుత మూలిక జటామాంసి..అందం,ఆరోగ్యం
బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా
బీట్‌రూట్‌ జ్యూస్‌ వీళ్లు అస్సలు తాగకూడదు తెలుసా
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్‌ యాన్‌ ఐడియా
రూ.2లక్షలకు రూ.90వేల వడ్డీ.. ఈ సూపర్ స్కీమ్ గురించి పక్కా..
రూ.2లక్షలకు రూ.90వేల వడ్డీ.. ఈ సూపర్ స్కీమ్ గురించి పక్కా..
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ తేజస్విని మృతి కేసులో సంచలన ట్విస్ట్
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ తేజస్విని మృతి కేసులో సంచలన ట్విస్ట్
సీరియల్ నటిని నమ్మి 10 కోట్లకు పైగా మోసపోయా..
సీరియల్ నటిని నమ్మి 10 కోట్లకు పైగా మోసపోయా..
మూగబోతున్న పల్లెలు.. మాయమవుతున్న పక్షి జాతులు! టెక్‌ భూతం ధాటికి
మూగబోతున్న పల్లెలు.. మాయమవుతున్న పక్షి జాతులు! టెక్‌ భూతం ధాటికి
స్నానానికి ముందా- తర్వాతా.. నూనె ఎప్పుడు రాస్తే జుట్టు ఒత్తుగా..
స్నానానికి ముందా- తర్వాతా.. నూనె ఎప్పుడు రాస్తే జుట్టు ఒత్తుగా..
వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ స్పెషల్ ఫోకస్
వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ స్పెషల్ ఫోకస్