Chicken Prices: మాంసం ప్రియులకు చేదు వార్త.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
రంజాన్ వేళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఒక మటన్ ధరలు కూడా అదే బాట పట్టాయి. రంజాన్ మాసం కావడంతో మాంసం విక్రయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎండ తీవ్రత కారణంగా కోళ్లు మరణిస్తున్నారు. దీంతో పాల్ట్రీ వ్యాపారులు ధరలను పెంచేశారు.

మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది. రంజాన్ మాసం కావడంతో చికెన్ విక్రయాలు పెరిగాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటం, ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతేకాకుండా ఎండాకాలం కావడంతో వేడికి కోళ్లు మరణిస్తున్నాయి. దీని వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరుగుతున్నాయని పాల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పండుగల సీజన్ క్రమంలో ధరల పెరుగుదలతో చికెన్ తినేవారికి ఖర్చు ఎక్కువవుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
కేజీ చికెన్ రూ.400
రంజాన్ పండుగ సందర్భంగా చికెన్ ధరలు ఒకేసారి పెరిగాయి. రంజాన్ కావడంతో చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. దీని వల్ల వల్ల డిమాండ్ పెరగడంతో ధరలు ఆమాంతం పెరిగాయి. మొన్నటివరకు కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.330 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.400 వరకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ రూ.350కి అమ్ముతుండగా.. విజయవాడలో రూ.400 పలుకుతోంది. అయితే ప్రాంతాలను బట్టి చికెన్ ధరల్లో తేడాలు ఉంటాయి. స్థానిక ఉత్పత్తి, డిమాండ్, రవాణా ఖర్చులను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. ఇక హైదరాబాద్‌లో డ్రెస్‌డ్ చికెన్ రూ.300గా ఉండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.207గా ఉంది. ఇక ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.180గా కొనసాగుతోంది.
మటన్ ధరలు
ఇక రంజాన్ వేళ మటన్ ధరలు కూడా పెరిగాయి. కిలో రూ.800గా ఉండే మటన్.. ఇప్పుడు రూ.వెయ్యికి చేరుకుంది. చికెన్, మటన్ ధరలు రెండూ పెరగడంతో వినియోగదారులపై భారం పడుతోంది. వేసవి కారణంగా కోళ్ల పెంపకం తగ్గిపోయింది. గతంలో లక్ష కోళ్లను ఫామ్స్‌లో పెంచేవారు. కానీ ఇప్పుడు 50 వేలకు తగ్గించారు. ఇక కోడిపిల్లలకు అయ్యే ఖర్చు కూడా పెరిగింది. గతంలో ఒక్కొ కోడిపిల్ల రూ.45కే లభించగా.. ఇప్పుడు రూ.61కి పెరిగింది. కోళ్ల పెంపకానికి అయ్యే ఖర్చు కూడా పెరుగుతోంది. ఇక దాణా ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా పెరిగాయి. ఈ కారణంతో ధరలు పెరిగినట్లు పాల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా కోళ్లు మరణిస్తుండటంతో.. పెంచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ధరల పెరుగుదలకు ఇది కూడా మరోక కారణంగా చెబుతున్నారు.
