AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు! ఎమ్మెల్యే సహా 42 మంది ప్రయాణికులు

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం వద్ద ఒడిశాకు చెందిన ఒక ప్రైవేట్ బస్సులో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బరంపురం నుండి మల్కన్‌గిరి వెళ్తున్న ఈ బస్సు టైర్ ఫంక్చర్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లో బస్సు అంతా వ్యాపించాయి. ఆ సమయంలో బస్సులో ఒడిశా చిత్రకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే మంగు ఖిల్లాతో సహా మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన డ్రైవర్..

విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు! ఎమ్మెల్యే సహా 42 మంది ప్రయాణికులు
Vizianagaram Bus Accident
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 12:23 PM

Share

విజయనగరం జిల్లాలో ప్రవేట్ బస్సుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించిన ఘటన స్థానికంగా భయాందోళన రేపింది. ఒడిశా బరంపురం నుంచి మల్కన్‌గిరి వైపు ప్రయాణిస్తున్న ప్రవేట్ బస్సు రామభద్రపురం మండలం తారాపురం వద్దకు చేరుకునేసరికి ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు టైర్ ఫంక్చర్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వాహనం వెనుక భాగంలో మొదలైన అగ్ని క్షణాల్లోనే వేగంగా బస్సు అంతా వ్యాపించింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో చాలా మంది నిద్రమత్తులో ఉన్నారు.

అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సులో నుంచి పొగ వస్తున్నట్లు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ప్రక్కన ఆపి ప్రయాణికులను హుటాహుటిన కిందికి దింపాడు. ప్రమాదాన్ని అంచనా వేసిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణ నష్టం తప్పలేదు.  క్షణాల్లో మంటలు పెరగడంతో కాసేపటికే బస్సు అంతా పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఒడిశా చిత్రకొండకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంగు ఖిల్లా కూడా ప్రయాణిస్తున్నాడు. ఆయన కూడా ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని డ్రైవర్ చాకచక్యాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.

విజయనగరం జిల్లాలో ప్రవేట్ బస్సుకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించిన ఘటన స్థానికంగా భయాందోళన రేపింది. ఒడిశా బరంపురం నుంచి మల్కన్‌గిరి వైపు ప్రయాణిస్తున్న ప్రవేట్ బస్సు రామభద్రపురం మండలం తారాపురం వద్దకు చేరుకునేసరికి ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు టైర్ ఫంక్చర్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వాహనం వెనుక భాగంలో మొదలైన అగ్ని క్షణాల్లోనే వేగంగా బస్సు అంతా వ్యాపించింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో చాలా మంది నిద్రమత్తులో ఉన్నారు. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

ఇవి కూడా చదవండి

బస్సులో నుంచి పొగ వస్తున్నట్లు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ప్రక్కన ఆపి ప్రయాణికులను హుటాహుటిన కిందికి దింపాడు. ప్రమాదాన్ని అంచనా వేసిన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణ నష్టం తప్పలేదు. క్షణాల్లో మంటలు పెరగడంతో కాసేపటికే బస్సు అంతా పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఒడిశా చిత్రకొండకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంగు ఖిల్లా కూడా ప్రయాణిస్తున్నాడు. ఆయన కూడా ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని డ్రైవర్ చాకచక్యాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us