AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది! అసలు తేడాలేంటి?

బెల్ పెప్పర్‌, క్యాప్సికమ్‌ దీనినే దొబ్బ మిరపకాయ అని కూడా అంటారు. మనం వంటకాల్లో రంగు రుచి కోసం క్యాప్సికమ్‌ను వాడుతుంటాం. బరువు తగ్గాలనుకునేవారు తరచుగా వాటిని తమ ఆరోగ్యకరమైన ఆహారంలో చేర్చుకుంటారు. క్యాప్సికమ్‌ మనకు ఏడాది పొడవునా సులభంగా లభిస్తాయి. ఎరుపు, ఆకుపచ్చతో సహా అనేక రంగులలో వస్తాయి. మార్కెట్లో పచ్చ రంగువి తక్కువ ధరకు దొరికితే, ఎరుపు, పసుపు రంగువి కాస్త ఖరీదుగా ఉంటాయి. కేవలం రంగులోనే కాదు, వీటిలో ఉండే పోషక విలువల్లో కూడా చాలా మార్పులు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది! అసలు తేడాలేంటి?
Capsicum
Jyothi Gadda
|

Updated on: Mar 21, 2026 | 7:42 AM

Share

క్యాప్సికమ్ లేదా దొబ్బ మిరపకాయలు వివిధ రంగుల్లో లభిస్తాయి. అయితే ఆకుపచ్చ, ఎరుపు రంగుల మధ్య పోషకపరంగా గణనీయమైన తేడాలు ఉన్నాయి.

పచ్చ క్యాప్సికమ్ (Green Capsicum):

ఇవి పూర్తిగా పండకముందే కోతకు వస్తాయి. అందుకే వీటిలో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉండి ఆకుపచ్చగా కనిపిస్తాయి. రుచిలో కొంచెం చేదుగా, పచ్చిగా ఉంటుంది. కానీ, ఇందులో విటమిన్-కె, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల డైటింగ్‌లో ఉండేవారికి ఇది ఉత్తమమైనది. ఇవి త్వరగా పండుతాయి. కాబట్టి మార్కెట్లో చౌకగా లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఎర్ర క్యాప్సికమ్ (Red Capsicum):

ఆకుపచ్చ క్యాప్సికమ్ పూర్తిగా పండిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ క్రమంలో దానిలోని పోషకాలు రెట్టింపు అవుతాయి. రుచి పరంగా చూస్తే ఇది తియ్యగా, జ్యూసీగా ఉంటుంది. సలాడ్లలో దీనిని ఎక్కువగా వాడుతుంటారు. ఎర్ర క్యాప్సికమ్‌లో విటమిన్-సి, విటమిన్-ఎ అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా బీటా-కెరోటిన్, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. ఇది చర్మ సౌందర్యానికి, కంటి చూపు మెరుగుపడటానికి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఏది ఎంచుకోవాలి?:

మీరు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల కోసం చూస్తున్నట్లయితే ఎర్ర క్యాప్సికమ్ ఉత్తమమైనది. కానీ, బరువు తగ్గడానికి, రోజువారీ వంటకాల్లో వాడటానికి పచ్చ క్యాప్సికమ్ సరిపోతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి రకరకాల పోషకాలు అందుతాయి. రంగు ఏదైనా క్యాప్సికమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీ అవసరానికి, బడ్జెట్‌కు తగినట్లుగా వీటిని ఎంచుకుని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు