AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. ఇక నుంచి ఆన్ లైన్ విధానం.. సులువుగా సేవలు పొందవచ్చు

ఏపీలో రేషన్ కార్డు ఉందా..? అయితే మీకు శుభవార్త. ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఆధార్ కార్డు సేవలు ఆన్‌లైన్ ద్వారా ప్రజలు సులభతరంగా పొందవచ్చు. ఇక నుంచి మీ సేవ ద్వారా 9 రకాల సేవలు ప్రజలు పొందవచ్చు.

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. ఇక నుంచి ఆన్ లైన్ విధానం.. సులువుగా సేవలు పొందవచ్చు
Ration Card
Venkatrao Lella
|

Updated on: Mar 21, 2026 | 7:21 AM

Share

రేషన్‌కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ కార్డుల్లో వివరాలు అప్‌డేట్ చేసుకునే ప్రక్రియను వేగవంతం, సులభతరం చేసింది. ఇక నుంచి అత్యంత సులువుగా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో కూడా కీలల మార్పులకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా వివరాలు మార్చుకోవాలన్నా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో రద్దీ కారణంగా ప్రజలు గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తోంది. అంతేకాకుండా అధికారులు వేర్వేరు పనుల్లో బిజీగా ఉండటం వల్ల రేషన్ సేవలు పొందే ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మీ సేవ పోర్టల్

ఇక నుంచి స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే కాకుండా మీ సేవ పోర్టల్ ద్వారా కూడా ప్రజలు రేషన్ కార్డు సేవలు ఆన్‌లైన్ ద్వారా సులువుగా పొందవచ్చు. తొమ్మిది రకాల సేవలను వీటి ద్వారా పొందే అవకాశముంది. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం దగ్గర నుంచి సభ్యుల్ని తొలగించడం, కొత్త సభ్యులను చేర్చడం, కార్డు విభజన చేసుకోవడం, కార్డు స్వాధీనం, కార్డులో వివరాలు అప్‌డేట్, ఆధార్ లింక్ చేయడం, డూప్లికేట్ కార్డు పొందటం, రేషన్ షాపుల వివరాలు అప్డేట్ వంటి సేవలు మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలు సులువుగా పొందవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇక అయితే ఇందుకోసం పలు నిర్ధారణ, ధృవీరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఇవి అవసరం

కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు జిరాక్సులు, ఫొటోలను అందించాలి. ఒక వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ వంటివి సమర్పించాలి. ఇక ఒక అడ్రస్ మార్పులు, కుటుంబ సభ్యుల వివరాలు సవరించుకునేందుకు ఆధార్ కార్డ్, మార్కుల లిస్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సమర్పించాలి. అటు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి గడువు ఉండదు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడతారు. మీ ఆర్ధిక స్థితిగతులను పరిశీలిస్తారు. అనంతరం మీకు అర్హత ఉంటే రేషన్ కార్డు జారీ చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోంది.

Follow Us
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్
ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?