AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Peels: ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా..? అందులో ఉన్న ఆరోగ్య గుట్టు తెలిస్తే ఇకపై అలా చేయ‌రు..

ఉల్లిపాయ ప్రయోజనాలకు సంబంధించి ఇప్పటికే అనేకం చూశాం. ఎన్నో పోషకాలు ఉన్న ఉల్లిపాయలను ప్రతి వంటింట్లో ఉపయోగిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఉల్లిపాయ లేని కూరలు అంత రుచిగా ఉండవని కూడా అంటుంటారు. అయితే ఉల్లిపొట్టుతో కలిగే లాభాలు తెలిస్తే.. ఇక మీదట దాన్ని పారేయకుండా దాచిపెట్టుకుంటారు.. ఉల్లిపొట్టులో విటమిన్లు A, K, C పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి దీని ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Mar 21, 2026 | 9:55 AM

Share
మీరు కూడా ఉల్లిపాయ తొక్కలను చెత్త అనుకుని పారేస్తుంటే, అలా చేసే ముందు వాటి ఉపయోగాలు తెలుసుకోండి. మీరు వాటిని సహజ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. ఇది మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. దీనిని కలపడం వల్ల మీ ఆకులు కూడా పచ్చగా ఉంటాయి. ఉల్లిపాయ తొక్కలను నీటిలో మరిగించి, ఆ నీటితో వంటగదిని శుభ్రపరచడం వల్ల దుర్వాసన పోతుంది. మీరు దీనిని ప్రతిరోజూ కూడా ఉపయోగించవచ్చు.

1 / 6
ఉల్లిపాయ పొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కండరాల నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఒక గ్లాసు నీటిలో కొంచెం ఉల్లిపాయ పొట్టు వేసి పదిహేను నిమిషాలు బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి తాగితే కండరాల నొప్పులు తగ్గుతాయి.

2 / 6
జుట్టు సంరక్షణకు ఉల్లిపాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉల్లిపాయలు కూడా సహాయపడతాయి. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. జుట్టు నెరసిపోకుండా కాపాడుతుంది. ఉల్లిపాయ పొట్టును నీటిలో వేసి మరిగించి దురద, దద్దుర్లు ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

3 / 6
ఇందుకోసం ఒక గ్లాసు నీళ్లలో నాలుగోవంతు తీసుకుని గంటసేపు బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం అప్లై చేయాలి. 30 నిమిషాల పాటు జుట్టు బాగా ఆరిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నెరసిపోవడం తగ్గుతుంది. చుండ్రు కూడా తొలగిపోతుంది.

4 / 6
యాంటీ ఫంగల్ గుణాలు కలిగిన ఉల్లిపాయ పొట్టు చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. ఉల్లిపాయ తొక్కలు మీ చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఉల్లిపాయ తొక్కలలో చర్మానికి అద్భుతంగా పనిచేసే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. తొక్కలను నీటిలో ఉడకబెట్టి, ఆ నీరు చల్లారిన తర్వాత మీ చర్మానికి పట్టించండి.  

5 / 6
ఉల్లిపాయ పొట్టుతో టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ టీ... నిద్రలేమిని దూరం చేసి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందుకోసం రెండు కప్పుల నీటిలో ఉల్లిపాయ పొట్టును వేసుకోవాలి. నీటి రంగు మారే వరకు మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి అందులో ఒక టీస్పూన్ తేనె కలిపితే ఆనియన్ టీ రెడీ!

6 / 6
Follow Us