AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone Tips: కొత్త ఫోన్ కొంటున్నారా..? ఈ చిన్న పొరపాటు చేస్తే కేసుల్లో చిక్కుకుంటారు.. జీవితాంతం మీకు ఇబ్బందులే

కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తున్నారా.. అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. కొత్త ఫోన్ తీసుకునేటప్పుడు మీరు కొన్ని పాటించాలి. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే మీకు చట్టపరంగా ఇబ్బందులు రావొచ్చు. లేదా ఏదైనా కేసులో అయినా చిక్కుకోవచ్చు. ఏం చేయాలో చూద్దాం.

Smart Phone Tips: కొత్త ఫోన్ కొంటున్నారా..? ఈ చిన్న పొరపాటు చేస్తే కేసుల్లో చిక్కుకుంటారు.. జీవితాంతం మీకు ఇబ్బందులే
Smart Phone
Venkatrao Lella
|

Updated on: Mar 21, 2026 | 12:04 PM

Share

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర పరికరంగా మారిపోయింది. ఒక్క నిమిషం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. మానవుల జీవితంలో ఫోన్ అనేది ఒక భాగమైపోయింది. మార్కెట్లోకి కొత్త టెక్నాలజీతో కూడిన అప్‌గ్రేడ్ వెర్షన్లు ఫోన్లు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. కొంతమంది స్మార్ట్ ఫోన్ ప్రియులు పాత ఫోన్లను ఎక్సేంజ్‌లో విక్రయించి కొత్త ఫోన్లను తీసుకుంటూ ఉంటారు. అయితే కొత్త ఫోన్లను తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల దొంగలించిన ఫోన్లను కూడా కొత్త ఫోన్ అంటూ కస్టమర్లకు అంటగడుతున్నారు. దీంతో మీరు కొంటున్నది కొత్త ఫోనా..? లేదా దొంగలించిన ఫోన్‌నా? అనేది తెలుసుకోవాలి. ఎలాంటి టిప్స్ పాటించాలో ఒకసారి చూద్దాం.

ఐఎంఈఐ గుర్తింపు

అంతర్జాతీయ మొబైల్ పరికర గుర్తింపు(ఐఎంఈఐ) నెంబర్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ప్రతీ ఫోన్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్‌ను కేటాయిస్తారు. దీనినే ఐఎంఈఐ నెంబర్‌గా పిలుస్తారు. ఇది 15 అంకెలతో ఉంటుంది. మీ ఫోన్ చట్టబద్దమైనదా.. లేదా అనేది తెలుసుకోవడానికి మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు దీని ద్వారా తెలుసుకుంటాయి. దీంతో ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నెంబర్‌ను చెక్ చేసుకోవాలి.

సమస్యలు ఎదురుకావొచ్చు

ఐఎంఈఐ నెంబర్ తనిఖీ చేసుకోకుండా కొనుగోలు చేస్తే మీరు భవిష్యత్తులో సమస్యల్లో పడొచ్చు. ఇటీవల దొంగలించిన ఫోన్లను, డూప్లికేట్ లేదా కోన్ల్ చేయబడిన ఐఎంఈఐ ఫోన్లను విక్రయిస్తున్నారు. ఇక ఇప్పటికే ఐఎంఈఐ నెంబర్‌ను బ్లాక్ చేసిన ఫోన్లు కూడా అమ్ముతున్నారు. ఇలాంటి ఫోన్లు ఏ నెట్ వర్క్‌లో పనిచేయవు. దీంతో మీరు కేసుల్లో చిక్కుకుని చట్టపరంగా చిక్కుల్లో పడే అవకాశముంది. దొంగ ఫోన్లను తక్కువ ధరకే విక్రయిస్తూ ఉంటారు. దీంతో తక్కువ ధరకు వస్తున్నాయనే ఆశతో వీటిని కొనుగోలు చేసి సమస్యల్లో పడతారు. పొగొట్టుకున్న ఫోన్లు, దొంగలించి ఫోన్లను CEIR సిస్టమ్ ద్వారా బ్లాక్ చేస్తారు. మరోసారి ఆ ఫోన్ ఉపయోగించకుండా నిరోధిస్తారు.

IMEI ఎలా చెక్ చేసుకోవాలి..?

-ఫోన్‌లో *#06# డయల్ చేయడం ద్వారా చెక్ చేసుకోవచ్చు

-KYM అని టైప్ చేసి 14422 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపడం ద్వారా తనిఖీ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది

-ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంచార్ సౌధీ యాప్, వెబ్ సైట్ ద్వారా కూడా ధృవీకరణ చేసుకోవచ్చు

-కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలి. లేకపోతే చిక్కుల్లో పడి మీరు జైలుకు వెళ్లాల్సి రావొచ్చు

Follow Us
వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే షాంపూ వాడితే ఏమవుతుంది?
వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే షాంపూ వాడితే ఏమవుతుంది?
ఈ 5 రకాల టిఫిన్స్ తింటే డాక్టర్ల చుట్టూ తిరిగే పనే ఉండదు..
ఈ 5 రకాల టిఫిన్స్ తింటే డాక్టర్ల చుట్టూ తిరిగే పనే ఉండదు..
ఖాళీ టాబ్లెట్ కవర్లను పారేయకుండా ఇలా వాడండి
ఖాళీ టాబ్లెట్ కవర్లను పారేయకుండా ఇలా వాడండి
శని దోషాలు పోవాలంటే శనివారం ఏ వృక్షాన్ని ఆరాధించాలి..
శని దోషాలు పోవాలంటే శనివారం ఏ వృక్షాన్ని ఆరాధించాలి..
రాగి పిండితో గుడ్డు లేకుండా బేక్ చేసే సీక్రెట్ రెసిపీ ఇదే!
రాగి పిండితో గుడ్డు లేకుండా బేక్ చేసే సీక్రెట్ రెసిపీ ఇదే!
వానాకాలంలో రోజూ అల్ల నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
వానాకాలంలో రోజూ అల్ల నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
IPL Trade: పాత గూటికే రిషభ్ పంత్.. ఆ మిస్టరీ స్పిన్నర్‌తో ట్రేడ్
IPL Trade: పాత గూటికే రిషభ్ పంత్.. ఆ మిస్టరీ స్పిన్నర్‌తో ట్రేడ్
ఇల్లు స్వర్గంలా మారాలంటే.. ఈ 7 రహస్యాలు తెలుసుకోండి
ఇల్లు స్వర్గంలా మారాలంటే.. ఈ 7 రహస్యాలు తెలుసుకోండి
ఈ ఐదు తప్పులు చేస్తే.. మనీ ప్లాంట్‌తో మీ సంపద కూడా పోవడం పక్కా..
ఈ ఐదు తప్పులు చేస్తే.. మనీ ప్లాంట్‌తో మీ సంపద కూడా పోవడం పక్కా..
అయోధ్య రామయ్యకు కోటీశ్వరుల మామిడి.. లక్ష విలువైన పండు నైవేద్యం!
అయోధ్య రామయ్యకు కోటీశ్వరుల మామిడి.. లక్ష విలువైన పండు నైవేద్యం!