AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగరేణి‌ శివంగులు.. భూగర్బ గనుల్లో పురుషులతో దీటుగా దూసుకెళుతున్న మహిళా కార్మికులు

నల్ల బంగారాన్ని గర్బంలో దాచుకున్న వెలుగుల తల్లి సింగరేణి. కనకరాశులకు తీసిపోని బొగ్గు నిక్షేపాల అవని.. శతాబ్దానికి పైగా తవ్వకాలు జరుపుతున్నా.. ఇంకా తరగని సిరిసపందలనిస్తూ ప్రపంచ ఖ్యాతి గడిస్తోంది ఆ తల్లి. సిరి వెలుగుల విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారమంటూ రాష్ట్ర కీర్తిని నలుదిక్కులా విస్తరింప జేస్తోంది. అంతటి ఖ్యాతి గడించిన తల్లి గర్బంలోకి ఒడి వడిగా అడుగులేస్తోంది అతివా లోకం. రేపటి భవిష్యత్ అంతా మాదే అంటూ వెలిగెత్తి చాటేందుకు సై అంటోంది. అతివ నడుం బిగిస్తే.. అసాధ్యమనేదే లేదంటూ నిరూపిస్తోంది సింగరేణి నారీ లోకం.

సింగరేణి‌ శివంగులు.. భూగర్బ గనుల్లో పురుషులతో దీటుగా దూసుకెళుతున్న మహిళా కార్మికులు
Singareni Women Miners
Naresh Gollana
| Edited By: |

Updated on: Mar 21, 2026 | 12:11 PM

Share

నల్ల బంగారాన్ని గర్బంలో దాచుకున్న వెలుగుల తల్లి సింగరేణి. కనకరాశులకు తీసిపోని బొగ్గు నిక్షేపాల అవని.. శతాబ్దానికి పైగా తవ్వకాలు జరుపుతున్నా.. ఇంకా తరగని సిరిసపందలనిస్తూ ప్రపంచ ఖ్యాతి గడిస్తోంది ఆ తల్లి. సిరి వెలుగుల విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారమంటూ రాష్ట్ర కీర్తిని నలుదిక్కులా విస్తరింప జేస్తోంది. అంతటి ఖ్యాతి గడించిన తల్లి గర్బంలోకి ఒడి వడిగా అడుగులేస్తోంది అతివా లోకం. రేపటి భవిష్యత్ అంతా మాదే అంటూ వెలిగెత్తి చాటేందుకు సై అంటోంది. అతివ నడుం బిగిస్తే.. అసాధ్యమనేదే లేదంటూ నిరూపిస్తోంది సింగరేణి నారీ లోకం.

ఒకప్పుడు బొగ్గుగనుల్లో పని చేయాలంటేనే జంకేవారు. భూమి పొరల్లో బొగ్గు వెలికి తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. గాలిసక్రమంగా అందక కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. గని ప్రమాదాల్లో చనిపోయిన వారెందరో ఉన్నారు. ఇక ముందుతరం ఈ పనులు చేయలేరు అని కార్మికులు అభిప్రాయపడేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గనుల్లో సాంకేతికత అభివృద్ధి చెందింది. సంస్థలో యువరక్తం చేరుతున్నది. కేసీఆర్‌ కల్పించిన కారుణ్య నియామకాల హక్కుతో కార్మికుల పిల్లల భవిష్యత్తుకు భరోసా ఏర్పడింది. ఇప్పుడు సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమ్మాయిలు సైతం బొగ్గు గనుల్లో అడుగుపెట్టారు. క్లిష్టమైన పనుల్లోనూ రాణిస్తున్నారు. అధికారులుగా, కార్మికులుగా, టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తూ.. చరిత్రను తిరగరాస్తున్నారు.

సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తిలో అమ్మాయిలు సైతం కదం తొక్కుతున్నారు. మాకు మేమే సాటి మాకెవరు లేరు పోటీ అంటూ పురుషులతో సమానంగా మైన్స్ లో దూసుకువెళుతున్నారు. ఆకాశంలోనే కాదు భూగర్బంలోను మేమే అంటూ వెలుగెత్తి చాటుతున్నారు. మజ్దూర్‌ నుంచి మేనేజర్‌ స్థాయి వరకు అన్ని కొలువుల్లో కొలువుదీరి మగమహారాజులకు దీటుగా రాణిస్తామంటూ సవాల్ విసురుతున్నారు ఉమెన్స్. పురుషులే భారంగా భావించే మైనింగ్‌ విభాగంలో ఉమెన్స్ సత్తా చాటుతూ సవాళ్లను అంతే ధైర్యంగా స్వీకరిస్తూ సత్తా చాటుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఒకప్పుడు సింగరేణి కార్యాలయాల్లో మినహా ఇతర విభాగాల్లో మహిళలు పనిచేసిన దాఖలాలు లేవు. 2018లో కేసీఆర్‌… సింగరేణిలో కారుణ్య నియామకాల హక్కును కల్పించి కార్మికుల పిల్లలకు భరోసా అందించారు. దీంతో కార్మికుడు చనిపోతే భార్య లేదా కుమారుడు, కుమార్తెకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఏర్పడింది. అలాగే కార్మికుడు అనారోగ్యంతో అన్‌ఫిట్‌ అయితే కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇచ్చే హక్కును మళ్లీ తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎందరో మహిళా కార్మికులు సంస్థలో అడుగుపెట్టారు. కేవలం కారుణ్య నియామకాల ద్వారానే కాకుండా టెక్నికల్‌ విద్యను అభ్యసించిన అమ్మాయిలు అండర్‌ మేనేజర్లుగా, ఓవర్‌మెన్‌లుగా బొగ్గుగనుల్లో ఉద్యోగం చేస్తున్నారు. సింగరేణిలో 11 డివిజన్లలో ప్రస్తుతం 2,146 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తుండగా, ఇందులో 204 మంది అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో రవీంద్రఖని 7 గనిలో 12 మంది మహిళలు భూగర్బ గనిలో విధులు నిర్వర్తిస్తుండగా.. మరో 40 మంది మహిళలు సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనుల్లో అదికారులు గా పనిచేస్తున్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలో మొత్తం 700 మందికి పైగా మహిళలు పనిచేస్తుండగా, వీరిలో శ్రీరాంపూర్లో 285, మందమర్రిలో 267, బెల్లంపల్లి ఏరియాలో 138, ఎస్టీపీపీలో 16 మంది చొప్పున కార్మికులుగా పనిచేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని ఓపెన్ కాస్ట్ మైన్ లో తొలిసారిగా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు అందరూ మహిళా ఉద్యోగులే నిర్వహిస్తున్నారు. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా శ్రీరాంపూర్ ఏరియా రవీంద్రఖని 7‌ భూగర్బ గనిలో 12 మంది మహిళా ఉద్యోగులు విధులు‌ నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. అటు ఓపెన్ కాస్ట్ మైన్ లలోను బొగ్గు రవాణాలో కీలకమైన సీహెచ్పీలో ఒక షిప్ట్ ను కూడా మహిళలకు కేటాయించింది. అటు సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ గనిలో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం గనిలో 5 వేల టన్నుల బొగ్గును వెలికితీస్తూ.. ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. హెడ్ ఓవర్ మెన్, జూనియర్ అసిస్టెంట్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఈపీ, డ్రిల్, కన్వేయర్, పంప్ ఆపరేటర్లు, జనరల్ అసిస్టెంట్, బంకర్ ఇన్ చార్జ్ తదితర హోదాల్లో మహిళా ఉద్యోగులు కార్మికులు పని చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ లో 11 గనులు ఉండగా… వీటి పరిధిలో కేటీకే -5, శ్రీరాంపూర్-7 గనులను పూర్తిస్థాయిలో మహిళా ఉద్యోగులకే ఒక్కో షిప్ట్ కేటాయించి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. బొగ్గు గని అంటే చీకటి గుహ. మగవాళ్లకే పరిమితమైన విధులను మహిళలు సైతం చేసి చూపిస్తామని నిరూపిస్తున్నారు. ‘మీరేం పని చేస్తారు’ అన్న ఎగతాళీ నోళ్లకు ముక్కుతాడు వేస్తూ మహిళలు తలచుకుంటే ఏ పనైనా చేయగలమని నిరూపించారు. కంపెనీలో కారుణ్య ఉద్యోగాల కారణంగా మహిళల సంఖ్య 1995 మందికి చేరింది. గత కొంతకాలంగా భూగర్భంలో కూడా పని చేస్తున్నారు.

బ్రిటీష్ కాలంలో పురుషులతోపాటు సమానంగా మహిళలు గనుల్లో పని చేసేవారు. ప్రమాదాలు నిత్యకృత్యంగా జరిగినా, తిండి లేక చావడం కంటే పిడికెడు మెతుకుల కోసం పనులకు వచ్చేవారు. ఎక్కువగా వితంతువులే ఈ పనులకు వెళ్లేవారు. దేశ స్వాతంత్య్రం వచ్చాక మహిళలను గనుల్లో తీసుకోవడం నిలిపివేశారు. ప్రమాదవశాత్తు గనుల్లో కార్మికులు చనిపోతే వారి స్థానంలో భార్యలకు ఉద్యోగం కల్పించే వారు. అది కూడా ఉపరితలంలోనే గుట్కాల షెడ్డులు, కార్యాలయాల్లో అటెండర్లుగా నియమించారు. మహిళలకు కూడా అవకాశాలు కల్పించాలనే ఓ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి.

వీడియో ఇక్కడ చూడండి…

కారుణ్య కోటాలో మొదట జనరల్ మజ్దాూర్(ఫిమేల్)గా నియమిస్తూ ఆఫీసులు, సివిల్ డిపార్టుమెంట్లలో తేలిక పాటి పనులకు తీసుకునే వారు. వీరి సంఖ్య పెరగడంతో ఓసీపీలు, వర్షిప్లు, స్టోర్స్, సీహెచ్పీలతోపాటు భూగర్భ గనుల్లో కూడా దిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓసీపీల్లో హెమ్ సెక్షన్లో పురుషులతోపాటు వీరు సమానంగా యంత్రాలను మరమ్మతు చేస్తున్నారు. సీనియర్ మహిళా కార్మికులు సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు. జనరల్ మజ్దాూర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, సబ్ ఓవర్సీస్ ట్రైనీ, స్టాఫ్ నర్స్, క్లే పిల్ మజూర్, స్వీపర్ బదిలీ ఇలా అన్ని విభాగాల్లోను సత్తా చాటుతున్నారు మహిళా ఉద్యోగులు.

భవిష్యత్ లో భూగర్బ గనులైనా..ఓపెన్ కాస్ట్ మైన్స్ అయినా ఉమైన్స్ వే అంటున్నారు సింగరేణి మహిళా ఉద్యోగులు. మహిళా అంటే వంటింటి కుందేలు కాదని.. ఆకాశంలో మాత్రమే సగం కాదని భూగర్బ గనుల్లోను సగమంటూ సత్తా చాటుతున్నారు. మమ్మల్ని తక్కువ అంచనా వేయవద్దని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us