ఆపిల్ తిని.. నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి!
23 May 2026
Jyothi Gadda
ఆపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, దానిని తినేటప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు రివర్స్ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఆపిల్ తిన్న వెంటనే నీరు తాగడం.
రోజుకో ఆపిల్ తింటే డాక్టర్‌తో పనే ఉండదు అనేది చాలా పాత సామెత. ఆపిల్‌లో ఉండే ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మన కడుపులో ఆహారం జీర్ణం కావడానికి జఠర రసం కొన్ని రకాల ఎంజైములు ఊరుతాయి. ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల ఈ జీర్ణ రసాలు పలచబడిపోతాయి. దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది, ఆహారం సరిగ్గా అరగదు.
ఆపిల్ తిన్న తర్వాత నీరు తాగడం వల్ల పొట్టలోని ఆమ్ల సమతుల్యత దెబ్బతింటుంది. పండ్లలో ఉండే కార్బోహైడ్రేట్లు, యాసిడ్స్, నీటితో కలవడం వల్ల కడుపులో గ్యాస్, తీవ్రమైన కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
తిన్న వెంటనే నీళ్లు తాగితే, ఆపిల్ జీర్ణాశయంలో ఎక్కువ సేపు ఉండిపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియకు లోనవుతుంది. దీనివల్ల పొట్టలో గ్యాస్ ఉత్పత్తి అయి కడుపు నొక్కుకుపోయినట్లు లేదా నొప్పగా అనిపించవచ్చు.
ఆహారం త్వరగా జీర్ణాశయం నుండి ప్రేగులలోకి నెట్టబడటం వల్ల ఆపిల్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలను శరీరం పూర్తిగా గ్రహించలేదు.
ఆపిల్ మాత్రమే కాదు, ఏ రకమైన పండ్లు (ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే పుచ్చకాయ, నారింజ, ఆపిల్ వంటివి) తిన్న తర్వాత కూడా వెంటనే నీరు తాగకూడదు.
పండ్లు తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి నీరు గానీ, ఇతర పానీయాలు గానీ తీసుకోకుండా ఉండటం జీర్ణవ్యవస్థకు అత్యంత సురక్షితం.