AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ సీరియల్ నటిని నమ్మి 10 కోట్లకు పైగా మోసపోయా.. టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్..

తెలుగులో ఒక్క సినిమాతో పాపులర్ అయ్యింది. కథానాయికగా మెప్పించిన ఆమె.. తర్వాత కమెడియన్ పాత్రలతో అలరించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా మారిన ఈ నటి.. ఆకస్మాత్తుగా సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలంపాటు సైలెట్ అయిన ఆమె.. ఇప్పుడు తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది.

Tollywood : ఆ సీరియల్ నటిని నమ్మి 10 కోట్లకు పైగా మోసపోయా.. టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్..
Geetha Singh
Rajitha Chanti
|

Updated on: Mar 21, 2026 | 12:59 PM

Share

టాలీవుడ్ నటి గీతా సింగ్ కితకితలు సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కామెడీ పాత్రలతో ఆకట్టుకుంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న గీతా సింగ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు పరిస్థితులను, ఎదురైన సవాళ్లను పంచుకున్నారు. ఒక సీరియల్ నటిని నమ్మి తాను భారీగా మోసపోయినట్లు వెల్లడించారు. కేవలం ఆ సీరియల్ నటి వల్ల 23 నుండి 24 లక్షల రూపాయలు కోల్పోయానని, మొత్తం మీద తనకు తొమ్మిది నుండి పది కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆమె వివరించారు. దేవత సీరియల్‌లో నంది అవార్డు గ్రహీత, ఉత్తమ నటిగా పేరున్న ఒక నటిని నమ్మి డబ్బులు పెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. తనకు దగ్గరైన వారే మోసానికి పాల్పడటం బాధాకరమని, అయితే జీవితంలో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

కెరీర్ అవకాశాలు: బాలీవుడ్‌లోని ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిల్మ్స్ నుండి హీరోయిన్ పాత్రకు వచ్చిన ఆఫర్‌ను గీతా సింగ్ కోల్పోయారు. ఆ కాల్‌ను ఫ్రాంక్ కాల్‌గా భావించి నిర్లక్ష్యం చేయడంతో ఈ విలువైన అవకాశం చేజారిందని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నటుడు అలీ చెప్పిన తర్వాతనే తాను తెలుసుకున్నానని అన్నారు. సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల తమిళంలో ఎమ్ ఎస్ రాజు నిర్మించిన కితకితలు లాంటి సినిమాలో నటించినప్పటికీ, అక్కడ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయానని పేర్కొన్నారు. తనలాగే ఉన్న విధ్యుల్లేఖకు తమిళంలో అవకాశాలు రావడాన్ని ప్రస్తావిస్తూ, ఆమె బిజీగా ఉండాలని కోరుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

సినీ పరిశ్రమలో దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ స్థానం గురించి గీతా సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఉన్న రోజుల్లో సినిమాల్లో కనీసం 60-70 మంది కమెడియన్లు ఉండేవారని, వారికి చిన్న సీన్ల ద్వారా అయినా ఉపాధి లభించేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాల్లో హీరో, హీరోయిన్, ఇద్దరు ముగ్గురు తప్ప ఇంకెవరూ కనిపించట్లేదని, కమెడియన్లకు అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీవీ ఉంటే సినీ పరిశ్రమ ఒక పండగలా ఉండేదని, అందరికీ మంచి భోజనం, సరదా వాతావరణం ఉండేదని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us