AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తోటకూర దోశ ఇలా చేస్తే.. ఒక ప్లేట్‎తో ఆపరు.. రెండు మూడు లాగిస్తారు

Thotakura dosa recipe: తోటకూర దోశ ఇలా చేస్తే ఒక ప్లేట్‎తో ఆపరు, రెండు మూడు లాగిస్తారు. ఎందుకంటే, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మంది ఇప్పటికి కూడా తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 21, 2026 | 12:30 PM

Share
కావాల్సిన పదార్ధాలు : రెండు కట్టలు తోటకూర,  2 కప్పులు బియ్యపు పిండి, అర టీ స్పూన్ జీలకర్ర, 50 గ్రాముల పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నూనెను తీసుకోవాలి. 

1 / 5
తోటకూర పేస్ట్: ముందుగా తోటకూర ఆకులు తీసుకుని వాటిని మూడు నుంచి నాలుగు సార్లు కడిగి, ఆ తర్వాత పచ్చిమిర్చితో రుబ్బుకుని , కొద్దిగా అల్లాన్ని మిక్సీ వేసి, వాటితో ఒక చిన్న గ్లాస్ నీరు  పోసి పేస్ట్‌లాగా చేసుకుంటే సరిపోతోంది.

2 / 5
పిండి కలుపుకోవడం: ఈ  తోటకూర పేస్ట్‌ ను తీసుకుని తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న దోశ పిండిలో వేసి  బాగా మిక్స్ అయ్యేలా  కలపుకోవాలి.  మీకు ఇంకా జోరుగా కావాలంటే ఒక గ్లాస్ నీరు, కొద్దిగా  జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి.

3 / 5
దోశ వేయడం: మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి పెనం పెట్టి, దాని మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, అది వేడయ్యాక ఒక పెద్ద గరిటెతో పిండిని దాని వేసి దోశ లాగా పోసుకోవాలి.

4 / 5
మరి హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం మంట మీద ఉంచి దోశ ఒక వైపు కాలిన  రెండు వైపు కూడా బాగా కాల్చుకోవాలి. అలా కాల్చిన తోటకూర అట్టును ఒక గిన్నె లేదా ప్లేట్ లోకి తీసుకోండి. అంతే, వేడి వేడి తోటకూర దోశ కూడా రెడీ. కొబ్బరి చట్నీతో తింటే అదిరిపోతోంది.

5 / 5
Follow Us