AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో కొత్త హైవే.. ఇక HYD వెళ్లడం మరింత ఈజీ..

ఆంధ్రప్రదేశ్ వాసులకు ఇదో సూపర్ గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.. ఎందుకంటే కోస్తాంధ్రలోని జీలుగుమిల్లి - పోలవరం - కొవ్వూరు మధ్య జాతీయ రహదారి 365బీబీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ నిర్మాణపనులను మొత్తం రెండు దశలుగా చేపట్టాలని నిర్ణయంచిన అధికారులు ఇప్పటికే తొలిదశ పనులను ప్రారంభించారు. త్వరలోనే తొలిదశ పూర్తి చేసి రెండో దశ పనులు కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ హైవే పూర్తైయితే హైదరాబాద్‌ వెళ్లేందుకు మార్గం మరింత సులభతరం కానుంది.

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో కొత్త హైవే.. ఇక HYD వెళ్లడం మరింత ఈజీ..
Andhra News
Anand T
|

Updated on: Mar 21, 2026 | 3:00 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నేషనల్ హైవే 365BB నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జీలుగుమిల్లి నుంచి పోలవరం మీదుగా కొవ్వూరు వరకు రెండు లైన్లుగా నిర్మిస్తున్న ఈ హైవే నిర్మాణ పనులను అధికారులు రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. తొలి దశలో భాగంగా జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం మధ్య రోడ్డు వేయాలని, అలాగే ఈ రూట్‌లో ఉన్న వాగులపై వంతెనల నిర్మాణం కూడా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ తొలి దశలో చేపట్టిన పనులన్నింటినీ ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.ఇక తొలి దశలో భాగంగా వాటితో పాటు ఎల్‌ఎన్‌డీపేట, పోలవరం మధ్య రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. దానితో పాటు దారి పోడవునా సీసీ డ్రెయిన్లను, 30 చోట్ల కల్వర్టుల నిర్మాణం చేపట్టారు.

హైవేపై 14 బస్‌స్టాప్‌లు

ఇక ఈ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా సుమారు 46.3 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హైవే వెళ్లే మార్గంలో భూసేకరణ కోసం డీపీఎఆర్ ఆమోదం రావాల్సి ఉంది. అయితే ఈ నేషనల్ హైవేపై బుట్టాయగూడెం మండలం వీరన్నపాలెం వద్ద టోల్‌ప్లాజాను ఏర్పాడు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు ఈ హైవేపై మొత్తం 14 ప్రాంతాల్లో బస్సులు ఆపేందుకు బస్‌స్టాపులను ఏర్పాటు చేయనున్నారు.

ఇక ఈ హైవే నిర్మాణం పూర్తయితే మన్యం జిల్లాలో నివసించే ప్రజలకు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాకపోకలు సులభతరం అవుతాయి. అలాగే అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు కూడా ఈ హైవే ఉపయోగపడుతుంది. ఇది ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తోంది. అంతేకాదు ఈ హైవే నిర్మాణంతో జాతీయ రహదారి వెంబడి ఉన్న చాలా నగరాలు అభివృద్ధి చెందనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర