Tirumala: తిరుమల వెళ్తున్నారా..? శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..
ఇదిలా ఉంటే, తిరుమల వైకుంఠ ద్వార దర్శనం జనవరి10 వ తేదీ నుంచి మొదలుకానుంది. 19వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో తిరుమలలో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.
ఆధ్యాత్మీక దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. అసలే శీతాకాలం..పైగా గత నాలుగైదు రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అయినప్పటికీ శ్రీవారిని దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ మాత్రం ఎక్కువగానే ఉంటోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్‌మెంట్లలో స్వామి వారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు లడ్డూ తయారీ కేంద్రాల వద్ద, అన్న ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. జనవరి 6 సోమవారం రోజున 54 వేల180 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 17 వేల 689 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, తిరుమల వైకుంఠ ద్వార దర్శనం జనవరి10 వ తేదీ నుంచి మొదలుకానుంది. 19వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో తిరుమలలో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి