Mosquitoes: ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు.. పరార్‌

ఈ వాసకు దోమలు రావు. అరటి తొక్కను పేస్ట్‌గా చేసుకొని దోమలు ఎక్కువగా ఉండే చోట్ల పెట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా దోమలు అటువైపు వచ్చేందుకు కూడా జంకుతాయి. అరటి తొక్కలను ఎండలో బాగాసేపు ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని ఒక చిన్నె గిన్నెలో వేసి కాల్చాలి. ఈ పొగను ఇళ్లంతా పట్టిస్తే దోమలు పారిపోతాయి.

Mosquitoes: ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు.. పరార్‌
Banana peel for control mosquito
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 07, 2025 | 11:17 AM

సాయంత్రం అయితే చాలు దోమలు ఓ రేంజ్‌లో దాడి చేస్తుంటాయి. దోమల కారణంగా డెంగ్యూ వంటివి అనేక రకాల వ్యాధులు వస్తుంటాయి. అందుకే దోమలను తరమికొట్టేందుకు చాలా మంది రసాయనాలతో కూడిన లిక్విడ్స్‌, కాయిల్స్‌ను ఉపయోగిస్తుంటారు. దోమలను చంపేందుకు ఉపయోగించే వాటి వల్ల మనుషులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే నేచురల్‌గా అరటి పండుతో దోమలను తరిమికొట్టొచ్చని మీకు తెలుసా.? అరటి తొక్కలతో దోమలు ఎలా పరార్‌ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం సింపుల్‌ టిప్స్‌లో భాగంగా సాయంత్రం సమయాల్లో అరటి తొక్కలను మీ గదిలోని నలుగు మూల్లో వేయాలి. వీటి నుంచి వెలువడే ఒకరకమైన వాసన దోమలను తరిమికొడుతుంది. ఈ వాసకు దోమలు రావు. అలాగే, అరటి తొక్కను పేస్ట్‌గా చేసుకొని దోమలు ఎక్కువగా ఉండే చోట్ల పెట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా దోమలు అటువైపు వచ్చేందుకు జంకుతాయట.

అంతేకాదు.. అరటి తొక్కను కాల్చితే కూడా దోమలు పారిపోతాయట. దోమల సమస్యను త్వరగా వదిలించుకోవడానికి, అరటి తొక్కను కాల్చినా కూడా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. అరటి తొక్కను కాల్చినప్పుడు దాని నుండి వెలువడే వాసన చాలా వింతగా ఉంటుంది. దీని కారణంగా దోమలు ఇంట్లోకి రావడానికి ఉంటాయట. అరటి తొక్కలను ఎండలో ఆరబెట్టుకుని, ఆ తర్వాత వాటిని ఒక చిన్న గిన్నెలో వేసి కాల్చాలి. ఈ పొగను ఇళ్లంతా పట్టిస్తే దోమలు పారిపోతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..