సిగ్గుందా.. ఇంత గలీజుగా వండి పెడతావా.. యూనివర్శిటీ మెస్ ఉద్యోగి నిర్వాకంపై స్టూడెంట్స్ ఫైర్
ఈ వీడియో విద్యార్థుల్లో వైరల్ కావడంతో, విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా వీడియోను పోస్ట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి భోజనం తిన్న విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడం సహజం అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మెస్ ఉద్యోగిపై యూనివర్సిటీ కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు సైతం డిమాండ్ చేశారు.
గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఫుడ్ సెఫ్టీ అధికారులు చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లు, కాలేజీ మెస్‌లు, స్కూల్స్ పిల్లలకు అందిస్తున్న భోజనాల వరకు అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే, తాజాగా మరో వీడియో ఇంటర్ నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది లక్నో యూనివర్శిటీ మెస్‌కు సంబంధించినదిగా తెలిసింది. మెస్‌లో పనిచేసే ఉద్యోగి ఒకరూ అక్కడ వంటకు ఉపయోగించే బంగాళాదుంపలు కడిగిన తీరుతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లలో మెస్‌లో వండిన ఆహారానికి సంబంధించిన వీడియోలు ఇంతకు ముందు అనేకం వైరల్‌గా మారాయి. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్ రాజధానిలోని లక్నో యూనివర్శిటీ మెస్‌లో బంగాళదుంపలు కడుతున్న ఓ మెస్ ఉద్యోగి చేసిన పని ఇప్పుడు అందరిలో ఆందోళనకు కారణం అయింది. ఇదంతా తెలిసన విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మెస్ ఉద్యోగి బంగాళాదుంపలు కడుగుతున్న వీడియోను చూసి, వినియోగదారులు ఇంటర్నెట్‌లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ వీడియో లక్నో యూనివర్సిటీలో నిర్మించిన కొత్త క్యాంపస్ హోమీ జహంగీర్ భాభా హాస్టల్‌లో జరిగినట్టుగా తెలిసింది. ఇందులో మెస్ ఉద్యోగి ఒకరు కాళ్లతో బంగాళదుంపలను కడుగుతూ కనిపించాడు. ఈ వీడియో విద్యార్థుల్లో వైరల్ కావడంతో, విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా వీడియోను పోస్ట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి భోజనం తిన్న విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడం సహజం అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మెస్ ఉద్యోగిపై యూనివర్సిటీ కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులు సైతం డిమాండ్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, @lucknowwaleyt అనే హ్యాండిల్ మొత్తం విషయాన్ని వివరంగా వివరిస్తూ సుదీర్ఘమైన పోస్ట్‌ను రాసింది. క్యాప్షన్‌లో, అతను ఇలా వ్రాశాడు- ఈ సంఘటన అపరిశుభ్రత సమస్యను తెలియజేయడమే కాకుండా, హాస్టల్ సిబ్బంది ఆహార నాణ్యత పట్ల ఎంత అజాగ్రత్తగా ఉన్నారో కూడా చూపుతుందని విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోని దాదాపు 80 వేల మంది వీక్షించారు. వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..