రూట్ మారింది గురూ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే సై అంటున్న స్టార్ హీరోయిన్స్!

ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకంటే ఎక్కువ, లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అనగానే అందరికీ నయనతార, అనుష్క శెట్టి మాత్రమే గుర్తు వచ్చేది. కానీ ఇప్పుడు రూట్ మారింది. సమంత, రష్మిక లాంటి గ్లామర్ పాత్రలు చేసే స్టార్ బ్యూటీస్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఒకే చెప్పేస్తున్నారు

Samatha J

|

Updated on: Jan 07, 2025 | 12:53 PM

ఎంతసేపూ గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ ఉండాలా..? మేం మాత్రం ఆర్టిస్టులం కాదా..? మాకేం నటన రాదా అంటున్నారు హీరోయిన్లు. అందుకే ఓ వైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ క్వీన్ అనే ట్యాగ్ కోసం తెగ తంటాలు పడుతున్నారు. తెలుగులోనే ఈ పోటీ ఎక్కువగా ఉంది. మరి ఈ రేసులో ఉన్నదెవరు..?

1 / 5
ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ఫైట్ మామూలుగా లేదిప్పుడు. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు అనుష్క, నయనతార లాంటి ఒకరిద్దరు బ్యూటీస్ మాత్రమే ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు.. అందరి దారి అదే అయిపోతుంది.

2 / 5
అనుష్క శెట్టి గ్యాప్ తీసుకున్నా కూడా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఈమె చేస్తున్న ఘాటీ త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు నయన్ అయితే పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. ఈ లిస్టులోకే సమంత చేరిపోయారు. మొన్న సిటాడెల్ సిరీస్‌తో అమ్మడి రేంజ్ మరింత పెరిగిపోయింది.

3 / 5
ఓ వైపు యానిమల్, పుష్ప లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు రష్మిక మందన్న. కీర్తి సురేష్ సైతం బాలీవుడ్ కోసం గ్లామర్ షో పంచుతూనే.. తనదైన శైలిలో లేడీ ఓరియెంటెడ్ కథలను అస్సలు వదలట్లేదు. రెయిన్ బో, గాళ్ ఫ్రెండ్ అంటూ సినిమాలు చేస్తున్నారు.

4 / 5
అనుపమ పరమేశ్వరన్ కూడా టిల్లు స్క్వేర్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ కథ పరదా ఓకే చేసారు. ప్రస్తుతం ఇది సెట్స్‌పై ఉంది. ఇక తమన్నా ఓదెల 2 అంటూ వచ్చేస్తున్నారు. సాయి పల్లవి కూడా ఛాన్స్ దొరికిన ప్రతీసారి తన సత్తా చూపిస్తున్నారు. వీళ్ళంతా లేడీ ఓరియెంటెడ్ క్వీన్ ముద్ర కోసం ట్రై చేస్తున్నారు.

5 / 5
Follow us