గాయపడిన కోడి.. ఓ కేసులో ప్రధాన సాక్షి .. స్పెషల్ భద్రత కల్పించిన పోలీసులు

ఈ కోళ్ల పందాలను నిర్వహిస్తున్నప్పుడు దాదాపు 200 మంది ఉన్నట్లు పోలీసు అధికారి నిర్మల్ సింగ్ తెలిపారు. ఈవెంట్ గురించి సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని అయితే తాము వెళ్లడం చూసిన అందరూ పారిపోయారని చెప్పారు. అయితే తమకు  రెండు కోళ్లు, ఒక వ్యక్తి కనిపించినట్లు పోలీసు అధికారి చెప్పారు. కోళ్ల పందెం నిర్వాహకులు జంతువులను ఇబ్బంది పెడుతున్నారని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

గాయపడిన కోడి.. ఓ కేసులో ప్రధాన సాక్షి .. స్పెషల్ భద్రత కల్పించిన పోలీసులు
Pandem Kodi In Punjab
Follow us

|

Updated on: Jan 25, 2024 | 11:49 AM

జంతు హింసకు సంబంధించి మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక చట్టాలున్నాయి. పక్షి, జంతు ప్రేమికులు జంతు హింసను వ్యతిరేకిస్తూ పోరాడతారు కూడా ఇందుకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. తాజాగా పంజాబ్‌లోని భటిండాలో జంతు హింసకు సంబంధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.. అక్కడ గ్రామంలో నిర్వహించిన కోడి పందాల్లో పోలీసులు కోడి ప్రాణాన్ని కాపాడారు. అంతేకాదు దానికి భద్రతను కూడా కల్పిస్తున్నారు. కోడికి గాయాలు అవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

బటిండాలోని బల్లువానా గ్రామంలో కోళ్ల  పందాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కోళ్ల పందాలను నిర్వహిస్తున్నప్పుడు దాదాపు 200 మంది ఉన్నట్లు పోలీసు అధికారి నిర్మల్ సింగ్ తెలిపారు. ఈవెంట్ గురించి సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని అయితే తాము వెళ్లడం చూసిన అందరూ పారిపోయారని చెప్పారు. అయితే తమకు  రెండు కోళ్లు, ఒక వ్యక్తి కనిపించినట్లు పోలీసు అధికారి చెప్పారు. కోళ్ల పందెం నిర్వాహకులు జంతువులను ఇబ్బంది పెడుతున్నారని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.

గాయపడిన కోడికి భద్రత కల్పించడంతో పాటు వైద్య, ఆహార సాయం అందిస్తున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని.. 11 ట్రోఫీలను కూడా స్వాధీనం చేసుకున్నామని సింగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు నిందితులపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులలో ఒకరైన రాజ్‌విందర్‌ను అరెస్టు చేశారు. అయితే అతను బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు.

ఈ కేసులో బాధితురాలైన కోడి కూడా ఒక సాక్ష్యమని కోర్టులో ప్రవేశ పెడతామని పోలీసులు చెప్పారు.  కేసు విచారణ సమయంలో కోర్టు ఎప్పుడు తమను సాక్ష్యం ప్రవేశ పెట్టమని అడిగితె అప్పుడు తాము ఈ కోడిని కోర్టులో హాజరు పరుస్తాము” అని నిర్మల్ సింగ్ చెప్పారు. అప్పటి వరకూ ఈ కోడిని అత్యంత జాగ్రత్తగా సొంత బిడ్డలా చూసుకోవాలి. అయితే పోలీస్ స్టేషన్‌లో కోడిని ఉంచితే ఒంటరి అయిపోతుందని భావించిన పోలీసులు ఈ కోడిని చూసుకునే బాధ్యతను ఓ కేర్‌టేకర్‌కి అప్పగించారు. అయితే కోడికి ఎలాంటి హాని కలగకుండా చూసేందుకు వ్యక్తిగతంగా పరామర్శించి యోగక్షేమాలు ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..