Success Story: మహిళకు అదృష్టాన్ని తెచ్చిన పుట్టగొడుగుల పెంపకం.. తక్కువ కాలంలోనే లక్షలను ఆర్జిస్తున్న వైనం
మహిళా రైతు పేరు సంగీత కుమారి. పాట్నా జిల్లాలోని అత్మల్‌గోలా బ్లాక్‌లోని ఫూలేర్‌పూర్ గ్రామ నివాసి. ప్రస్తుతం సంగీత కుమారి జీరో టిల్లేజ్ సహాయంతో పుట్టగొడుగులు, బంగాళదుంపలతో సహా ఇతర ఆకుపచ్చ కూరగాయలను పండిస్తోంది. అంతేకాదు ఇతర మహిళలకు కూడా వ్యవసాయం చేసేందుకు శిక్షణ ఇస్తోంది. తాను వ్యవసాయం చేయక ముందు ఇంటి ఖర్చులకు డబ్బు కొరత ఉండేదని సంగీత కుమారి చెప్పింది. తన దగ్గర కనీసం రూ.1000 కూడా ఉండేది కాదని చెప్పింది.
దేశంలో అనేక ప్రాంతాల్లో మహిళలు కూడా ఇప్పుడు పురుషులతో కలిసి అడుగులు వేస్తున్నారు. అది విద్య, ఉద్యోగ రంగాల్లో మాత్రమే కాదు వ్యవసాయ రంగమైనా.. సరే తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోము అంటూ నేడు మహిళలు తాము అడుగు పెట్టిన రంగాల్లో అడుగు పెట్టి పేరు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో అడుగు పెట్టి కూరగాయలను పండిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఓ స్ఫూర్తివంతమైన మహిళ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మహిళా రైతు సక్సెస్ పై చర్చ జరుగుతోంది. విశేషమేమిటంటే ఈ మహిళా రైతు సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండిస్తోంది. ఈ మహిళ వద్ద కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇతర గ్రామాల నుంచి కూడా వస్తుంటారు.
ఆ మహిళా రైతు పేరు సంగీత కుమారి. పాట్నా జిల్లాలోని అత్మల్‌గోలా బ్లాక్‌లోని ఫూలేర్‌పూర్ గ్రామ నివాసి. ప్రస్తుతం సంగీత కుమారి జీరో టిల్లేజ్ సహాయంతో పుట్టగొడుగులు, బంగాళదుంపలతో సహా ఇతర ఆకుపచ్చ కూరగాయలను పండిస్తోంది. అంతేకాదు ఇతర మహిళలకు కూడా వ్యవసాయం చేసేందుకు శిక్షణ ఇస్తోంది. తాను వ్యవసాయం చేయక ముందు ఇంటి ఖర్చులకు డబ్బు కొరత ఉండేదని సంగీత కుమారి చెప్పింది. తన దగ్గర కనీసం రూ.1000 కూడా ఉండేది కాదని.. ఎప్పుడైతే కూరగాయల సాగు ప్రారంభించానో అప్పటి నుంచి తన ఆర్థిక పరిస్థితి మారిపోయిందని చెప్పింది. సంగీత వ్యవసాయం చేస్తూ ఏటా రెండు లక్షలకు పైగా సంపాదిస్తోంది. కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులు తీరాయి.
పుట్టగొడుగుల పెంపకం
సంగీత కుమారి ఓ వైపు చిన్న ఉద్యోగం చేస్తూనే .. మరోవైపు ఒక బిగాలో పుట్టగొడుగులు, బంగాళాదుంపలు, ఇతర పంటలను పండిస్తోంది. 2015వ సంవత్సరంలో సంగీత తన కుమార్తె వివాహం చేసింది. అప్పటి నుంచి ఆమె ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో సంగీత భర్త నెలకు 1500 రూపాయలతో స్కూల్ లో ఉద్యోగం ప్రారంభించాడు. అయితే అంత తక్కువ డబ్బుతో ఇంటిని నడపడం ఆమెకు చాలా కష్టంగా ఉండేది. ఆ సమయంలో సంగీత 2016లో జీవికలో చేరింది. 2019లో వ్యవసాయం పై దృష్టి పెట్టి.. పుట్టగొడుగులతో సహా కూరగాయల సాగులో శిక్షణ తీసుకుంది. అనంతరం స్వయంగా పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది.
2 లక్షలకు పైగా సంపాదిస్తున్న సంగీత
తొలిసారి పుట్టగొడుగులు అమ్మి రూ.10వేలు సంపాదించిన సంగీత బంగాళదుంపలను ఇంట్లోనే కుండీల్లో పెంచడంపై దృష్టి సారించింది. ఓ వైపు పుట్టగొడుగులు పెంచుతూనే మరో వైపు జీరో టిల్లేజ్ పద్ధతిలో రెండు కుండీల్లో బంగాళదుంపలు పండించింది. అప్పుడు ఆ రెండు కుండీల నుంచి 40కి పైగా బంగాళదుంపలు ఉత్పత్తి అయ్యాయి. బంగాళాదుంప సాగుతో పాటు మిరప, బెండకాయ, టమోటా, క్యాబేజీ, ఇతర కూరగాయలను ఒక బిగాలో పండిస్తోంది. ఇపుడు సంగీత ఏడాదికి రూ.2 లక్షలకు పైగా సంపాదీస్తోంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..