India vs Bharat: భారతదేశాన్నిఅనేక పేర్లతో పిలుస్తారు.. ఇండియా ఎప్పుడు వాడుకలోకి వచ్చింది.. అంతకుముందు ఏ పేరుతో పిలిచేవారో మీకు తెలుసా.. .

అమృతోత్సవ వేళ దేశం పేరు ఇండియా మారి భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో ఈ పేర్ల వెనకున్న చరిత్ర ఏంటో తెలుసా! ఇండియా పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏం పేర్లున్నాయనేది ఆసక్తికరంగా మారింది. భరత వర్ష, భారత అనేది పురాణాల కాలం నుంచి వినిపిస్తున్న పేర్లు. ఆర్యావర్త, జంబూద్వీపం, నభివర్ష అనే పేర్లు కూడా వైదిక సంస్కృతిలో కనిపిస్తాయి.

India vs Bharat: భారతదేశాన్నిఅనేక పేర్లతో పిలుస్తారు.. ఇండియా ఎప్పుడు వాడుకలోకి వచ్చింది.. అంతకుముందు ఏ పేరుతో పిలిచేవారో మీకు తెలుసా.. .
India Vs Bharath
Follow us
Surya Kala

|

Updated on: Sep 06, 2023 | 12:01 PM

భారత్, ఇండియా అనే పేరుపై దేశంలో రాజకీయ దుమారం మొదలైంది. G-20కి సంబంధించి, సెప్టెంబర్ 9న విందుకు ఆహ్వాన పత్రికలో భారత రాష్ట్రపతి అని రాసి ఉందని, అంతకుముందు ఇండియా ప్రెసిడెంట్ అని రాసి ఉందని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. దేశ గౌరవానికి సంబంధించిన అంశంపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత అభ్యంతరమని అన్నారు. అమృతోత్సవ వేళ దేశం పేరు ఇండియా మారి భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో ఈ పేర్ల వెనకున్న చరిత్ర ఏంటో తెలుసా! ఇండియా పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏం పేర్లున్నాయనేది ఆసక్తికరంగా మారింది. భరత వర్ష, భారత అనేది పురాణాల కాలం నుంచి వినిపిస్తున్న పేర్లు. ఆర్యావర్త, జంబూద్వీపం, నభివర్ష అనే పేర్లు కూడా వైదిక సంస్కృతిలో కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం మూడువేల సంవత్సరాలనాటి మెసపటోమియా నాగరికత కాలంలో లభించిన ఆధారాల ప్రకారం సింధు నాగరికత విలసిల్లిన ప్రస్తుత భారత ఉపఖండాన్ని మెలూహా పేరుతో పిలిచే వారని చరిత్రకారులు చెబుతున్నారు. రాజకీయ చరిత్రలో మెలూహాకు పెద్ద ప్రాధాన్యం లభించలేదు. భరతవర్ష, భారత్‌ మాత్రం తరతరాలుగా కొనసాగుతూ వచ్చాయి.

పర్షియన్ల రాకతో హిందూ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దిలో సింధు లోయను స్వాధీనం చేసుకున్న పర్షియన్లు – సంస్కృతంలోని సింధును హిందుగా పలికారు. క్రీస్తుశకం ఆరంభంలో దీనికి పర్షియన్‌ పదం ‘స్థాన్‌’ జోడించి హిందుస్థాన్‌గా మార్చేశారు. పర్షియన్ల హింద్‌ కాస్తా గ్రీకుల నోళ్లలో ఇండస్‌గా మారింది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దిలో అలెగ్జాండర్‌ భారత్‌పై దండెత్తి ఇండస్‌ తర్వాతి ప్రాంతాన్ని ఇండియాగా పలికాడు. అనంతరం భారత దేశంలో అడుగు పెట్టిన మొఘల్‌ చక్రవర్తులు మన దేశాన్ని హిందూస్తాన్ గా పిలిచేవారు. అంతేకాదు మన దేశాన్ని ఆసియాలోని అనేక దేశాల్లో ‘హిందుస్థాన్‌’గానే పిలిచేవారు.. ఇదే పేరు 18వ శతాబ్దం చివరి వరకూ ప్రాచుర్యంలో ఉంది.

ప్రాచీన గ్రీకులు భారతదేశానికి సింధు అనే పదాన్ని ఉపయోగించారు. తరువాత ఈ పదం రోమన్ల ద్వారా లాటిన్ భాషలోకి వెళ్ళింది. లాటిన్ నుండి ఈ పదం ఆంగ్ల భాషలో వచ్చి ఇండియాగా మారింది. 16వ శతాబ్దంలో బ్రిటీష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు.. వారికి భారతదేశం అనే పేరు కూడా తెలుసు. భారతదేశానికి “హిందుస్తాన్”, “జంబూద్వీప్పం”, “ఆర్యవర్త”, “హిందూదేశం”,  సింధు దేశం, హిందూస్తాన్ , భరత వర్షం వంటి అనే ఇతర పేర్లు కూడా ప్రసిద్ధి చెందాయి.

ఇవి కూడా చదవండి

అఖండ భారత దేశం బ్రిటిష్‌ వారి పాలనలోకి వెళ్లిన తర్వాత అప్పటి వరకూ ఉన్న హిందూస్తాన్ ప్లేస్ లో ఇండియా చేరింది. మనదేశంలో తమ ప్రభావాన్ని నెలకొల్పడానికి బ్రిటిష్ వారు మన పేర్లు, చదువు, సంప్రదాయాలను మరుగుపరిచేలా చేస్తూ.. ఇండియా పేరుని చేర్చారు. సర్వే ఆఫ్‌ ఇండియా వంటి వాటితో అధికారికంగా వాడడం మొదలు పెట్టారు. బ్రిటిష్‌ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం మళ్ళీ దేశం పేరుపై చర్చ జరిగింది. ఇండియా పేరునే కొనసాగించాలని కొంతమని కోరితే.. లేదు భారత్ అనే కొనసాగించాలని మరికొందరు డిమాండ్ చేశారు. అయితే చివరకు రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే రెండు పేర్లు వాడకంలో ఉంచేశారు.

అయితే అప్పుడప్పుడు ఇండియా పేరుని భారత్ గా మార్చాలని డిమాండ్ తెరపైకి వస్తూనే ఉన్నాయి. 2012లో కాంగ్రెస్‌ సభ్యుడు శాంతారాం నాయక్‌ .. భారత్‌ మాతాకీ జై అంటాము కానీ.. ఇండియాకీ జై అనం సో మన దేశం పేరుని భారత్ గా మార్చమంటూ పార్లమెంటులో దేశం పేరును భారత్‌ గా మార్చాలని బిల్లుని ప్రవేశ పెట్టారు. తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఎంపీగా ఉన్న సమయంలో 2014లో భారత్ గా పేరు మార్చాలనే డిమాండ్ తో బిల్లుని ప్రవేశ పెట్టారు. అంతేకాదు చాలామంది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇది తమ చేతుల్లో లేదని.. కేంద్రం చేతుల్లో ఉందని పేర్కొంది. అయితే ఇప్పుడు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగత్ ఇక నుంచి అయినా ఇండియా ప్లేస్ లో భారత్ గా పిలమంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో మనదేశంపై పేరు మళ్ళీ చర్చల్లో నిలిచింది.  జీ20 శిఖరాగ్ర సమావేశాల ఆహ్వాన పత్రికలో భారత్ ప్రస్తావన తీసుకువచ్చింది కేంద్రం. దీంతో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకుతెరలేపినట్లు అయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు