జగన్నాథ స్వామి పూరి, ఒరిస్సా: ఒడిశాలోని పరివిత్ర పుణ్యక్షేత్రం పురిలోని జగన్నాథ ఆలయం. ఇక్కడ శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. జన్మాష్టమి కంటే ఈ క్షేత్రంలో జరిగే రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ రథయాత్రకు హిందూ మతపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి, జగన్నాథుని రథాన్ని లాగడానికి ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు. జగన్నాథుడు, తన సోదరి, అన్న తో కలిసి చేసే ప్రయాణం కోసం మూడు భారీ రథాలు సిద్ధం చేస్తారు. ఈ ప్రయాణంలో బలరాముడు అధిరోహించే రథం ముందు వరుసలో ఉంటుంది.. అనంతరం సోదరి సుభద్ర రథం.. శ్రీకృష్ణుడి రథం ప్రయాణిస్తాయి.